సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి మరో బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరించారు. నీ అంతుచూస్తానంటూ హెచ్చరించాడు. దాంతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదుచేశారు కిషన్ రెడ్డి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. గతంలోనూ ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి తన ప్రాణాలకు ముప్పుపొంచి ఉన్నట్లు తెలిపారు. తాజాగా మరోసారి అదే తరహా ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Kishan Reddy, Secunderabad S29p08, Telangana, Telangana News