బీజేపీ వార్షిక ఆదాయం రూ.1,000 కోట్లు..మిగిలిన పార్టీల ఆడిట్ రిపోర్ట్ ఇదిగో

2017-18 సంవత్సరంలో బీజేపీ ఆదాయం రూ.1,027.339 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా...రూ.104.847 కోట్ల వార్షిక ఆదాయంతో సీపీఎం రెండోస్థానంలో ఉంది.

news18-telugu
Updated: December 18, 2018, 12:22 PM IST
బీజేపీ వార్షిక ఆదాయం రూ.1,000 కోట్లు..మిగిలిన పార్టీల ఆడిట్ రిపోర్ట్ ఇదిగో
బీజేపీ, కాంగ్రెస్ లోగోలు
  • Share this:
2017-18 సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆదాయ, వ్యయ వివరాలను అధికార బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఆదాయం రూ.1,000 కోట్లుగా ఉండగా...వ్యయం రూ.750 కోట్లుగా తన ఆడిట్ రిపోర్ట్‌లో బీజేపీ వెల్లడించింది. ఈ మేరకు ఎలక్షన్ వాట్చ్‌డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) బీజేపీ ఆడిట్ రిపోర్ట్‌ను సోమవారం విడుదల చేసింది. 2017-18 సంవత్సరంలో బీజేపీ ఆదాయం రూ.1,027.339 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా...రూ.104.847 కోట్ల వార్షిక ఆదాయంతో సీపీఎం రెండోస్థానంలో ఉంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వార్షిక ఆదాయం రూ.51.694 కోట్లుగా చూపింది. ఆ సంవత్సరపు ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు సమర్పించలేదు.

2016-17 సంవత్సరంతో పోల్చితే బీజేపీ వార్షిక ఆదాయం రూ.7 కోట్ల మేర తగ్గింది. 2016-17 సంవత్సరంలో బీజేపీ వార్షిక ఆదాయం రూ.1,034.27 కోట్లుగా ఉంది.


వ్యయ వివరాలకు సంబంధించినంత వరకు, 2017-18 సంవత్సరంలో బీజేపీ వ్యయం రూ.758.47 కోట్లుగా చూపింది. సీపీఎం రూ.83.482 కోట్ల వ్యయం చూపగా, బీఎస్పీ రూ.14.78 కోట్ల వ్యయాన్ని ఈసీకి సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో చూపింది.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వార్షిక ఆదాయం రూ.8.15 కోట్లు కాగా...వ్యయం రూ.8.84 కోట్లు. ఆదాయం కంటే రూ.69 లక్షలు వ్యయం ఎక్కువ అయినట్లు ఆడిట్ రిపోర్ట్‌లో చూపింది.Assam TMC hief Resigns As Mamata Banerjee Opposes NRC
టీఎంసీ లోగో, మమతా బెనర్జీ


మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణాముల్ కాంగ్రెస్ పార్టీ వార్షిక ఆదాయం రూ.5.167 కోట్లు, సీపీఐ వార్షిక ఆదాయం రూ.1.55 కోట్లుగా ఉంది.

2016-17 సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.225.36 కోట్లుగా చూపిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు ఆ సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కాపీని ఈసీకి సమర్పించలేదు. 2017-18 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలతో కూడిన ఆడిట్ రిపోర్ట్‌ను అన్ని పార్టీలు ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరుకల్లా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది.
Loading...
ఇవి కూడా చదవండి
First published: December 18, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...