హోమ్ /వార్తలు /National రాజకీయం /

CM KCRపై దేశద్రోహం కేసు.. PM Modi బాడీ షేమ్, నిర్మలకు అవమానం: BJP సంచలనం

CM KCRపై దేశద్రోహం కేసు.. PM Modi బాడీ షేమ్, నిర్మలకు అవమానం: BJP సంచలనం

తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిసైడైంది. రాజ్యాంగాన్ని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి నిర్మలను దారుణంగా అవమానించినందుకు ప్రతిగా..

తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిసైడైంది. రాజ్యాంగాన్ని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి నిర్మలను దారుణంగా అవమానించినందుకు ప్రతిగా..

తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిసైడైంది. రాజ్యాంగాన్ని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి నిర్మలను దారుణంగా అవమానించినందుకు ప్రతిగా..

జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత నుంచి బీజేపీపై టార్గెట్ చేస్తూ, కేంద్రంలోని మోదీ సర్కారుపైనా యుద్దాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రతి సందర్భంలోనూ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతూ రాష్ట్ర రాజకీయాలను స్వయంగా వెడెక్కిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత. ఇటీవల కేంద్ర బడ్జెట్ పై స్పందన తెలియజేస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పైనా కేసీఆర్ విమర్శలు సంధించారు. అయితే, గులాబీ బాస్ వాడిన పదజాలంపై కమలదళం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కేసీఆర్ కొత్త రాజ్యాంగం కామెంట్లపైనా బీజేపీ న్యాయపోరాటినికి దిగింది. ఆ క్రమంలోనే సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని టీబీజేపీ నిర్ణయించుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరి 14నుంచి కోర్టుల ముందు 'చేంజ్ సీఎం.. నాట్ కానుస్టూషన్' పేరుతో బీజేపీ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రామచంద్రరావు ఈ విషయాలను వెల్లడించారు.

CM KCR ఆహ్వానాన్ని PM Modi మన్నిస్తారా? -గులాబీ బాసే మనసు మార్చుకుంటారా?ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా న్యాయపోరాటం చేస్తామని రామచంద్రరావు తెలిపారు. రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసన తెలిపితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడ్తున్నారన్నారని బీజేపీ నేత వాపోయారు.

Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం ‘గద్వాల బిడ్డ’ ఇకలేడు -నెటిజన్ల దిగ్భ్రాంతి -మీమ్స్ వెల్లువ


ప్రధాని మోదీ బాడీ షేమింగ్‌పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు రామచంద్రరావు. దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ అంబేద్కర్‌ను అవమానించారన్నారు. రాజ్యాంగం రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారనీ..ఇది దేశ వ్యతిరేక చర్యే అవుతుందని బీజేపీ నేత అన్నారు.

Covid Shocking: కరోనా టెస్టుల కోసం రెండేళ్లలో ప్రజలు చేసిన ఖర్చు.. రూ.74 వేల కోట్లు!


కేంద్రంపై కేసీఆర్ యుద్దం ప్రకటించడం కాదు.. సీఎం కేసీఆర్‌పైనే బీజేపీ ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తోందని రామచంద్రరావు సమరశంఖం పూరించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, రాజ్యాంగాన్ని, ప్రధాని మోదీని అవమానించిన సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Bjp, CM KCR, Pm modi, Trs

ఉత్తమ కథలు