రోమ్ చక్రవర్తిని తలపిస్తున్నారు.. చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు

పెథాయ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. గాలి దుమారంతో తీరప్రాంతాలను వణికిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. పక్కరాష్ట్రాల్లో జరుగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు వెళ్లడం.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

news18-telugu
Updated: December 17, 2018, 2:32 PM IST
రోమ్ చక్రవర్తిని తలపిస్తున్నారు.. చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు
babu at congress cm
  • Share this:
ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో పెథాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన ఈదురుగాలులతో రాష్ట్రంలో ఏ నిమిషం, ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, రాష్ట్రప్రజలకు అండగా ఉండి, సహాయసహాకారాలను విస్తృతం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. కానీ, చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి... పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లడం రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. ఆయన తీరును ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని విడిచిపెట్టి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు తీరును.. తీవ్రంగా విమర్శిస్తున్నారు.

madhya pradesh, rajasthan, madhya pradesh chhattisgarh, madhya pradesh elections, madhya pradesh election, madhya pradesh election result, madhya pradesh news, madhya pradesh exit polls, madhya pradesh exit poll, madhya pradesh opinion poll 2018, rajasthan elections, rajasthan election results, chhattisgarh and madhya pradesh, madhya pradesh elections results, madhya pradesh election results, చంద్రబాబు, చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్, ప్రమాణ స్వీకారోత్సవానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, rajasthan, ashok gehlot rajasthan cm, rajasthan election result, rajasthan cm, rajasthan cm news, ashok gehlot cm rajasthan, 2018, chhattisgarh, chhattisgarh election 2018, chhattisgarh election, chhattisgarh assembly election 2018, mp chhattisgarh, chhattisgarh cm, inc chhattisgarh, etv chhattisgarh, chhattisgarh news, etv mp chhattisgarh, voting in chhattisgarh, new chhattisgarh cg song, outgoing chhattisgarh cm,chhattisgarh latest news,chhattisgarh congress cm,chhattisgarh chunav 2018,chhattisgarh election news,chhattisgarh chief minister, Ashok Gehlot in Rajasthan, Kamal Nath in MP, Baghel in Chhattisgarh, to be sworn in as Congress CMs today; Rahul Gandhi, Chandra Babu to attend all 3 ceremonies
అశోక్ గెహ్లాట్, చంద్రబాబు(File)


చంద్రబాబు తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు రాష్ట్రం పెథాయ్ తుఫానుతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో మూడింట రెండొంతుల జనం వర్షాలతో, వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు జైపూర్‌కు వెళ్లడం శోచనీయమన్నారు. చంద్రబాబు తీరు.. ఓవైపు నగరం తగలపడిపోతుంటే పిడేలు వాయించుకున్న రోమ్ చక్రవర్తిని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. భయంకరమైన పెథాయ్ తుఫానుకు ఏపీ అల్లాడుతుంటే.. ఎలాంటి బాధ్యత లేకుండా చంద్రబాబు జైపూర్‌లో ల్యాండయ్యారని ఆరోపించారు.‘‘సొంత రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, పక్కరాష్ట్రంలో విగ్రహాల ఆవిష్కరణకు వెళ్తారా? ఇదేనా రాష్ట్రప్రజల పట్ల మీ బాధ్యత?’’ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. చెన్నైలో దివంగత డీఎంకే నేత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లడంపై.. ఆయన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యతగా సీఎం పదవిలో ఉండి.. చంద్రబాబు నీరో చక్రవర్తిలా ప్రవర్తించారని విమర్శించారు.

ఇక, చంద్రబాబుపై తీరుపై సామాన్యజనంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రిపై విమర్శలు సంధిస్తున్నారు. ఏపీలో ప్రకృతి విలయం సంభవించిన వేళ.. చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లడం పట్ల మండిపడుతున్నారు. దీన్నిబట్టి ఏపీ ప్రజల పట్ల చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు. సొంత రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, పక్క రాష్ట్రాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు.ఈరోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఉదయం  రాజస్థాన్ బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రంలోగా వచ్చేస్తానని.. ఎప్పటికప్పుడూ పెథాయ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు.. ఏపీ ప్రజల పట్ల నిర్లక్షవైఖరిని తెలియజేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by: Santhosh Kumar Pyata
First published: December 17, 2018, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading