Home /News /politics /

BJP CHIEF JP NADDA TAKES ON TELANGANA CM KCR IN GHMC ELECTION ROAD SHOW BA

JP Nadda Campaign in GHMC Elections: కేసీఆర్ పాలనకు ఇక ముగింపే: జేపీ నడ్డా

JP Nadda in GHMC Election Campaign: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా

JP Nadda in GHMC Election Campaign: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలన అంతం అయ్యే సమయం వచ్చిందని చెప్పారు.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC Elections) ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda). ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు, కమలాన్ని వికసింపజేసేందుకు తాము ఎక్కడికైనా వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K.Chandrasekhar Rao) పాలన ముగిసే టైమ్ వచ్చిందని జేపీ నడ్డా అన్నారు. ‘ఈ రోజు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చూస్తుంటే కేసీఆర్ పాలన ముగిసే టైమ్, బీజేపీ పాలన వచ్చే సమయం వచ్చినట్టుగా ఉంది.’ అని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో అవినీతి పాలనను అంతం చేసేందుకు మోదీ సారధ్యంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని డివిజన్లలోనూ బీజేపీని గెలిపించాలని జేపీ నడ్డా ఎన్నికల రోడ్ షోలో ప్రజలను కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తపేట నుంచి నాగోల్ వరకు జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వందశాతం కష్టపడి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని నడ్డా పిలుపునిచ్చారు.

    Raghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్రరావు, నలుగురు హీరోయిన్లు..

    AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్, డిసెంబర్ నుంచి..

    కేవలం మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా బీజేపీ అగ్రనేతలను తీసుకొస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ కమలం నేతల మీద విమర్శలు గుప్పించింది. ‘హైదరాబాద్‌లో ఎన్నికల కోసం అమిత్ షా, జేపీ నడ్డా, యోగి, కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో.’ అంటూ మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు  జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. కమలాన్ని వికసింపజేసేందుకు, అవినీతిని పారద్రోలేందుకు తాము ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేస్తామన్నారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ నుంచి పెద్దలు వస్తున్నారని ఎవరో అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. అవినీతి రహిత పాలన కోసం, కమలాన్ని వికసింపజేసేందుకు మేం ఎక్కడికైనా వస్తాం.’ అని జేపీ నడ్డా రోడ్ షోలో ప్రకటించారు.

    Gold Rates: మంచిరోజులు వచ్చాయ్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

    కేటీఆర్‌కు ‘దొరికిపోయిన’ బీజేపీ.. బండి సంజయ్‌పై బీభత్సంగా ట్రోలింగ్

    Tirupati ByPolls: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తున్న బీజేపీ, తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు? 

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రేపు (నవంబర్ 28) హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం కాకపోయినా.. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈనెల 28న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శిస్తారు. కేవలం రెండు గంటల పాటు మాత్రమే ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఈనెల 29న ఎన్నికల ప్రచారం చివరి రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020, JP Nadda, Telangana bjp, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు