Home /News /politics /

BJP CHIEF JP NADDA HAS MADE SENSATIONAL COMMENTS THAT POLITICS IN WEST BENGAL WILL BE DIFFERENT FROM NOW ON PRV

JP nadda: ‘‘ఇక ఆ రాష్ట్రం​లో బీజేపీ రాజకీయం వేరుగా ఉంటుంది” : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

జేపీ నడ్డా ( Photo:ANi/Twitter)

జేపీ నడ్డా ( Photo:ANi/Twitter)

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ (West bengal, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), రాజస్థాన్ (Rajasthan) ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా విశ్లేషించారు. బెంగాల్ రాజకీయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు

ఇంకా చదవండి ...
    డిల్లీ (Delhi) లో ఆదివారం బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్రమంత్రులు (Union ministers), పలువురు అగ్రనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ (West bengal, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), రాజస్థాన్ (Rajasthan) ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా బెంగాల్ రాజకీయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఇక బీజేపీ రాజకీయం వేరుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. "బెంగాల్ ప్రజలకు నేను ఓ హామీ ఇస్తున్నాను. భాజపా మీకు తోడుగా ఉంటుంది. ఇక బెంగాల్‌లో బీజేపీ రాజకీయం వేరుగా ఉంటుంది ” అని అన్నారు.

    ఫలితాలను చూస్తున్నాం..

    జాతీయ కార్యవర్గం సమావేశానికి వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  మాట్లాడుతూ.. ‘‘  కోవిడ్ వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మోదీ జీ.. టీకాల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు,  ఈ రోజు మనం దాని ఫలితాన్ని చూడవచ్చు. 9 నెలల్లో 1 బిలియన్ డోస్‌లు టీకాలు వేశాం. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ 'కోవాక్సిన్'ను డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఆమోదించింది” అన్నారు.



    బెంగాల్​లో పాగా వేయలేకపోవడంతో..

    దేశంలో చాలా ప్రాంతాల్లో మోదీ (Narendra modi) గాలి వీచినా పశ్చిమ బెంగాల్​లో మాత్రం దీదీ మమతా బెనర్జీ (Mamata Banerjee) హవానే నడిచింది. కొన్ని నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులను దింపినా .. స్వయంగా మోదీ దిగినా బీజేపీ (BJP) అధికారం దక్కించుకోలేకపోయింది. ఆ సమయంలో బీజేపీ హిందు కార్డు ప్రయోగించినా దీదీ తిప్పికొట్టింది.  టీఎంసీని విజయపథంలో నిలిపింది. అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోనూ దీదీ గెలిచారు. దీంతో బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా వైఫల్యంపై స్వప్నన్ దాస్ గుప్తా, అనుపమ్ హజ్రా, కైలాశ్ విజయ వర్గీయతో జేపీ నడ్డా చర్చించారు.

    కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై..

    పార్టీలో కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)లోకి వెళ్లడంపై కూడా చర్చించినట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా నేతలు చర్చించనున్నారు. భారత్ 100 కోట్ల వ్యాక్సినేషన్‌ మార్కును చేరుకున్నందుకు గాను ప్రధాని మోదీ (PM Narendra modi)కి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు సన్మానం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, JP Nadda, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు