Home /News /politics /

claps and candles:  అప్పట్లో మోదీ చప్పట్లు ఎందుకు కొట్టమన్నారో.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా

claps and candles:  అప్పట్లో మోదీ చప్పట్లు ఎందుకు కొట్టమన్నారో.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్​ జేపీ నడ్డా

జేపీ నడ్డా ( Photo:ANi/Twitter)

జేపీ నడ్డా ( Photo:ANi/Twitter)

కరోనా సమయంలో ప్రజలతో ప్రధాని మోదీని చప్పట్లు కొట్టించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.  అయితే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఘాటుగా స్పందించారు.

    ఏప్రిల్​ 5న  ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు (lights) ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనా (corona)పై యుద్ధం చేస్తోన్న వీరులకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ఇచ్చిన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు కరోనా వైరస్ (corona virus) వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కటయ్యారు. ఉదయం 7 గంటల నుంచి ఇళ్లలోనే ఉన్న ప్రజలు సాయంత్రం సరిగ్గా  5 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ (claps), పళ్లాల మీద గరిటెలతో కొడుతూ (claps and candles) కరోనాపై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతరులకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీ నుంచి  పల్లెటూళ్ల వరకు ప్రజలు ఇలా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ఇవి కేవలం చప్పట్లు కావని (claps and candles), కరోనా వైరస్‌పై పోరాటంలో విజయనాదం అని అప్పట్లో ప్రధాని మోదీ (Pm Narendra modi) అన్నారు. అయితే ఇలా చప్పట్లు కొట్టడం, శబ్దాలు మోగించడంపై కాంగ్రెస్​తో సహా విపక్ష నేతలంతా (opposition leaders) ఎద్దేవా చేశారు. 

    ప్రజలు మనోధైర్యంగా ఉండేందుకు..

    జనం చేత చప్పట్లు కొట్టిస్తేనో.. లేక ఆకాశంలోకి లైట్లేస్తేనో వైరస్ పోదని ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఆ సంఘటనపై పలువురు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.  అయితే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఘాటుగా స్పందించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రజలు చప్పట్లు కొట్టి కొవ్వొత్తులను వెలిగించాలని (claps and candles) ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోధైర్యంగా ఉండేందుకు ఇలా చేయించారని వివరణ ఇచ్చారు.

    ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP Chief JP Nadda) మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 130 కోట్ల జనాభా కరోనాపై భీకర యుద్ధం చేశామన్నారు. ప్రధాని ఈ చప్పట్లు కొట్టడం (claps) మరియు కొవ్వొత్తులు వెలిగించడం (candles) వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంతో పాటు దేశప్రజలందరినీ (Indian people) ఏకతాటిపైకి తీసుకురావాలని మోడీ భావించారన్నారు. ప్రజలు కరోనా మహమ్మారిపై పోరాడాలని చెప్పాలనుకుంటున్నారు, ఆ సమయంలో ప్రజల మనోధైర్యాన్ని పెంచడానికి ఇది జరిగిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

    ‘మన్ కీ బాత్’ (man ki bath) రేడియో కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని జేపీ నడ్డా వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ వేదికల ద్వారా రాజకీయ అంశాలను ముందుకు తెచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదన్నారు.

    ప్రజలను అన్ని రంగాల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశ ప్రజలకు చేరాలన్న సంకల్పంతోనే రేడియో కార్యక్రమం కొనసాగుతోందన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, JP Nadda, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు