మోదీ కేబినెట్‌లో అమిత్ షా.. ఆ కీలక శాఖ అప్పగించే ఛాన్స్?

Lok Sabha Elections 2019: హోం శాఖ బాధ్యతలను సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నందున.. అమిత్ షా రక్షణ శాఖను దక్కించుకునే అవకాశాలే ఎక్కువని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: May 22, 2019, 8:12 AM IST
మోదీ కేబినెట్‌లో అమిత్ షా.. ఆ కీలక శాఖ అప్పగించే ఛాన్స్?
ప్రధాని మోదీతో అమిత్ షా(ఫైల్)
  • Share this:
ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేదే విజయం అని తేలిపోయింది. దాదాపు విజయం తమదేనని బీజేపీ ధీమాతో ఉంది. బీజేపీకే అధికారం దక్కితే మోదీయే ప్రధానమంత్రి. మరి ఆయన కేబినెట్‌లో మంత్రులెవరు? అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. మోదీ నమ్మిన బంటు అమిత్ షా కేబినెట్‌లో చేరతారని, ఆయనకు కీలక రక్షణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. హోం శాఖ బాధ్యతలను సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నందున.. అమిత్ షా రక్షణ శాఖను దక్కించుకునే అవకాశాలే ఎక్కువని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, బీజేపీ చీఫ్‌గా అమిత్ షా పదవీకాలం డిసెంబర్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, తిరిగి 2024 ఎన్నికల ముందు మళ్లీ పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగిస్తారని సమాచారం.

మరోవైపు, బీజేపీ మధ్యప్రదేశ్, కర్ణాటకపైనా కన్నేసినట్లు కనిపిస్తోంది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే ఆ ప్రభావం కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలపై పడే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ఉండగా, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మరోసారి కాషాయ జెండా ఎగిరితే ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>