జగన్ విషయంలో విజయసాయిరెడ్డికి... అమిత్ షా క్లాస్

జగన్‌గా ఎంపీగా ఉన్న సమయంలోనే 16నెలలు జగన్‌ను జైల్లో ఉంచారన్న విషయాన్ని గుర్తు చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 4:08 PM IST
జగన్ విషయంలో విజయసాయిరెడ్డికి... అమిత్ షా క్లాస్
అమిత్ షాను కలిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి
  • Share this:
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ప్రధానితో పాటు... కేంద్ర హోంమత్రి అమిత్ షా.. పలు పార్టీలకు చెందిన నేతలంతా హాజరయ్యారు.అయితే ఈ భేటీలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. సమావేశం సందర్భంగా చిదంబరానికి పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలని అఖిలపక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ కోరారు. దీంతో ఈ విషయంలో విజయసాయిరెడ్డి కలగజేసుకున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించారు. గతంలో జగన్‌గా ఎంపీగా ఉన్న సమయంలోనే 16నెలలు జగన్‌ను జైల్లో ఉంచారన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌కు ఓ న్యాయం... చిదంబరానికి ఓ న్యాయమా అంటూ.. ప్రశ్నించారు.

అయితే చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యంపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది... మేం నోట్ చేసుకున్నామన్నారు షా. మీకు సంబంధం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారంటూ విజయసాయిరెడ్డిపై సీరియస్ అయ్యారు. జగన్ జైలుు వ్యవహారాన్ని చిదంబరానికి ఎలా ముడిపెడతారంటూ సాయిరెడ్డిని అమిత్ షా ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని విజయసాయిరెడ్డికి మిగతా అఖిల పక్ష నేతు సైతం క్లాస్ తీసుకున్నారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు