ఆదివారం తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ అధ్యక్షుడి సుడిగాలి పర్యటన

ఎన్నికలు దగ్గరపడున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ప్రచారంలో వేడి పుట్టిస్తున్నారు. ఆదివారం తెలంగాణకు రానున్న అమిత్‌షా.. పలు బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

news18-telugu
Updated: November 24, 2018, 2:04 PM IST
ఆదివారం తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ అధ్యక్షుడి సుడిగాలి పర్యటన
అమిత్ షా(File)
news18-telugu
Updated: November 24, 2018, 2:04 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తలపెట్టిన నాలుగు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

ఉదయం 9గంటలకు హైదరాబాద్ రానున్న అమిత్ షా.. అక్కణ్నుంచి పరకాల చేరుకుంటారు. 11 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం, నిర్మల్‌కు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు తలపెట్టిన బహిరంగసభలో పాల్గొంటారు అమిత్ షా. సాయంత్రం నాలుగింటి దుబ్బాక ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటలకు అమిత్‌షా మధ్యప్రదేశ్ బయల్దేరి వెళ్తారు.

ఇప్పటికే టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు ప్రచారంలో స్పీడు పెంచారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా, బీజేపీ సైతం అధ్యక్షుడు అమిత్‌షాను ప్రచార రంగంలోకి దింపుతుండడంతో .. ఆ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతోంది. అధ్యక్షుడు పాల్గొనే బహిరంగసభలకు భారీ జనసమీకరణే లక్ష్యంగా రాష్ట్రా పార్టీనేతలు కృషిచేస్తున్నారు.

First published: November 24, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...