దొంగ ఓట్లు వేయండి అంటున్న బీజేపీ అభ్యర్థి... ఎందుకో తెలుసా ?

సంఘమిత్ర మౌర్య బహిరంగ సభలో ప్రసంగిస్తూ కార్యకర్తలను దొంగఓట్లు వేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లోనూ దొంగఓట్లు వేయడం సాధారణ విషయమే అని, ఓటింగ్ కు రాని ఓటర్లను గుర్తించి వారి ఓట్లను వేయాలని కార్యకర్తలతో అన్నారు.

news18-telugu
Updated: April 20, 2019, 7:31 PM IST
దొంగ ఓట్లు వేయండి అంటున్న బీజేపీ అభ్యర్థి... ఎందుకో తెలుసా ?
సంఘమిత్ర మౌర్య (image : facebook)
  • Share this:
ఓటర్లు రాకపోతే...వారి పేరిట దొంగఓట్లు వేయండి అంటూ బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో బదౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంఘమిత్ర మౌర్య తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంఘమిత్ర మౌర్య బహిరంగ సభలో ప్రసంగిస్తూ కార్యకర్తలను దొంగఓట్లు వేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లోనూ దొంగఓట్లు వేయడం సాధారణ విషయమే అని, ఓటింగ్ కు రాని ఓటర్లను గుర్తించి వారి ఓట్లను వేయాలని కార్యకర్తలతో అన్నారు. అంతేకాదు, ఈ దొంగఓట్ల తతంగమంతా కాస్త రహస్యంగా జరిపించాలని బహిరంగంగా కార్యకర్తలకు ప్రబోధించడం కొసమెరుపు. కాగా సంఘమిత్ర చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో సైతం పెట్టారు.

ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర, యూపీ రాష్ట్రమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె కావడం విశేషం. గతవారం సైతం సంఘమిత్ర ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు