news18-telugu
Updated: November 22, 2020, 7:43 PM IST
బీజేపీ అభ్యర్థి విశ్వనాథన్
ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ ఓ బీజేపీ అభ్యర్థి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే కిందపడి మరణించాడు. కేరళలోని కొల్లామ్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటచేసుకుంది. అక్కడి పోలీసుేలు తెలిపిన వివరాల ప్రకారం...60 ఏళ్ల ఎలిపరాంబత్ విశ్వనాథన్ అనే వ్యక్తి స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పన్మానా పంచాయతీ పరిధిలోని పరాంపిముక్కు వార్డులో బీజేపీ తరపున బరిలోకి దిగారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రచారం పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో శనివారం కార్యకర్తలో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు విశ్వనాథన్.
ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూనే.. మైక్‌ను వదిలేసి స్టేజిపై కుప్పకూలిపోయారు. అక్కడున్న కార్యకర్తలు ఆయన్ను లేపే ప్రయత్నం చేసినప్పటికీ ఉలుకూ పలుకూ లేదు. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే విశ్వనాథన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విశ్వనాథ్ మృతితో పన్మామా పంచాయతీ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ పార్టీ అభ్యర్థి మృతి పట్ల బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 22, 2020, 7:36 PM IST