#AmitShahToNews18 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే : అమిత్ షా

Amit Shah on Maharashtra Assembly Elections 2019 : మహారాష్ట్రలో అభివృద్ది శరవేగంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు మహారాష్ట్ర అభివృద్ది కోసం ఏడాదికి కేవలం రూ.1.22లక్షల కోట్లు మాత్రమే ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక రూ.4.78లక్షల కోట్ల కంటే ఎక్కువే ఇచ్చామన్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 8:20 AM IST
#AmitShahToNews18 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే : అమిత్ షా
అమిత్ షా
  • Share this:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. బీజేపీ-శివసేన కలిసి మూడింటిలో రెండొంతుల సీట్లను గెలుచుకుంటాయన్నారు. అయితే బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదు. దానిపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని.. కానీ గతంలో కంటే మెరుగైన సీట్లను
సాధిస్తామన్నారు.మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి నెట్‌వర్క్18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 22 సీట్లు అవసరం కావడంతో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మేజిక్ ఫిగర్ సాధిస్తుందా? అని రాహుల్ జోషి అమిత్ షా‌ను ప్రశ్నించారు. దానికి అమిత్ షా.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా, విజయవంతంగా సాగుతోంది. 2014లో మేము ఒంటరిగానే పోటీ చేసి.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించాం. ఆ తర్వాత శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. గతంలో 15 ఏళ్ల యూపీఏ
పాలనలో మహారాష్ట్రలో వ్యవసాయ రంగం,కోఆపరేటివ్ సంస్థలు,పెట్టుబడులు.. ఇలా అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. కానీ బీజేపీ అధికారం చేపట్టిన ఐదేళ్లలలోనే అన్ని రంగాల్లో ప్రగతి నమోదైంది.
అమిత్ షా,కేంద్ర హోంమంత్రి


సీఎం దేవేంద్ర ఫడ్నవీస్-ప్రధాని నరేంద్ర మోదీ జోడి మహారాష్ట్ర అభివృద్దికి దోహదం చేశాయన్నారు అమిత్ షా. బీజేపీ కార్యకర్తలు జనంలోకి వెళ్లి... ప్రధాని మోదీ,సీఎం ఫడ్నవీస్ రాష్ట్రానికి చేసిన అభివృద్దిని వివరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో అభివృద్ది శరవేగంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు మహారాష్ట్ర అభివృద్ది కోసం ఏడాదికి కేవలం రూ.1.22లక్షల కోట్లు మాత్రమే ఇచ్చాయని గుర్తుచేశారు.
కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక రూ.4.78లక్షల కోట్ల కంటే ఎక్కువే ఇచ్చామన్నారు. గడిచిన ఐదేళ్లలో మహారాష్ట్ర అభివృద్దికి గట్టి పునాదులు వేశామని.. రాబోయే 20 ఏళ్లలో వాటిని అమలుచేసి చూపిస్తామని అన్నారు.ఫడ్నవీస్‌కు వివాదరహితుడు అన్న పేరు ఉండటం కూడా బీజేపీకి కలిసి వస్తుందన్నారు. మరోసారి ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలుస్తారన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీపై ఎలాగైతే ఒక్క అవినీతి మరక లేదో.. మహారాష్ట్రలో ఫడ్నవీస్‌పై కూడా అవినీతి మరక లేదన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రతిపక్షాల నుంచి అలాంటి ఆరోపణ ఒక్కటి కూడా వినిపించలేదన్నారు. ఫడ్నవీస్ పారదర్శక పాలనకు ఇదే నిదర్శనమన్నారు.
First published: October 17, 2019, 7:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading