టీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టిన బీజేపీ ప్లాన్... సక్సెస్ అయినట్టే...

టీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ చేపట్టిన ప్రచారం వర్కవుట్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: January 18, 2020, 3:23 PM IST
టీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టిన బీజేపీ ప్లాన్... సక్సెస్ అయినట్టే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు నేతలు ఎన్నో ప్రచారాలు చేస్తుంటారు. వీటిని తిప్పికొట్టేందుకు పార్టీలు కూడా తమదైన వ్యూహాలు రచిస్తుంటాయి. అయితే తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఓ ప్రచారంతో అధికార టీఆర్ఎస్ ఇరుకున పడిందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని మేయర్ పదవిని ఎంఐఎం పార్టీకి కట్టబట్టే యోచనలో టీఆర్ఎస్ ఉందని బీజేపీ ఆరోపించింది. కీలకమైన నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు మరికొన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు కట్టబెట్టనుందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేపట్టింది.

ఈ ప్రచారంతో తమకు నష్టం కలుగుతుందని భావించిన టీఆర్ఎస్ వెంటనే... ఇందుకు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. మహబూబ్ నగర్‌లో ఎంఐఎంకు చైర్మన్ పదవి కాదు కదా కనీసం వైస్ చైర్మన్ పదవి కూడా ఇవ్వబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. నిజామాబాద్ మేయర్ పదవి ఎంఐఎంకు ఇచ్చినట్టయితే... తాను ముక్కునేలకు రాస్తానని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాలా గుప్తా వ్యాఖ్యానించారు.

కరీంనగర్ మేయర్ పదవి కూడా టీఆర్ఎస్‌కే ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ వివరణ ఇచ్చుకున్నారు. మంత్రి తలసాని సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎంఐఎంతో తమ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. మొత్తానికి టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న రాజకీయ స్నేహంపై బీజేపీ చేసిన ప్రచారంతో టీఆర్ఎస్ అప్రమత్తమైనట్టు అర్థమవుతోంది.First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు