తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటిస్తున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని రైతు సమస్యల మీద నిలదీశారు. సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలంటూ మెరుపు ధర్నా చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బందోబస్తు చర్యలుచేపట్టినా కూడా బీజేపీ కార్యకర్తలు ఆకస్మికంగా ప్రత్యక్షం కావడంతో టీఆర్ఎస్ నేతలు పోలీసులు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పోలీసుల భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
TATA Cars offers: డిసెంబర్లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసిన టీఆర్ఎస్, రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొని నిరసన తెలిపాయి.
Live Video: చిరుత దాడి.. భయంకరంగా చంపేసింది.. పీక్కుని, లాక్కెళ్లింది
విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం
ఓ వైపు కేంద్రంపై టీఆర్ఎస్ దాడి చేస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ మీద బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన విధంగా సన్న రకం వరిని సాగు చేసిన రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తూ రైతుల బంద్‌కు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..
Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు
మొన్న ఖమ్మంలో కేటీఆర్‌కు నిరసన సెగ
డిసెంబర్ 7న ఖమ్మం పర్యటనలో కేటీఆర్‌కు నిరసన సెగ ఎదురైంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంవల్ల ఐటీ హబ్ ప్రారంభోత్సవం పేరుతో పెద్ద డ్రామా క్రియేట్ చేశారని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఐటీ హబ్‌లో కనీసం 150 మంది కూడా లేరని.. అది కేవలం ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ కోసం ఆడుతున్న డ్రామా అని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 09, 2020, 16:15 IST