Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: November 23, 2019, 9:02 AM IST
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్రలో శివసేనసై బీజేపీ మహా సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలా ఇలా కాదు.. శివసేనాని ఉద్దవ్ థాక్రేకు ఊహించి అదను చూసి దెబ్బ కొట్టింది. దీంతో మహా రాజకీయ చదరంగంలో బీజేపీ మరోసారి తన ప్రత్యర్ధులపై పై చేయి సాధించినట్టైయింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు కట్టబెట్టారు ఓటర్లు. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా సీట్లు రాకపోవడంతో..అదను చూసి శివసేన ముఖ్యమంత్రి పదవి చెరిసగం రెండున్నరేళ్లు పంచుకోవాలని షరతు విధించింది. దీనికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ తర్వాత గవర్నర్ బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించింది. ఎవరు ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో గవర్నర్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసారు.

న్యూస్ 18 క్రియేటివ్
రాష్ట్రపతి పాలన తర్వాత శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సహాయం కోరాడు. ఈ ముగ్గురి మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం కింద కొన్ని షరతులు విధించుకున్నారు. ముందుగా శివసేన అధినేత తన కొడుకు ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనుకున్నారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం ఉద్దవ్ థాక్రే.. సీఎం అయితేనే సపోర్ట్ చేస్తామన్నారు. మరోవైపు మంత్రి పదవుల విషయంలో వీళ్ల మధ్య అండర్ స్టాండింగ్ జరిగింది. శివసేన ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవితో పాటు.. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు.. కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి అన్నట్టు ముగ్గురి మధ్య ఒప్పందం ఖరారైంది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే సీఎం అని దాదాపు ఖరారైందని అందరు అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం అనూహ్యంగా అర్ధరాత్రి చక్రం తిప్పి..ఎన్సీపీ సపోర్ట్‌తో దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. మరోవైపు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫడ్నవీస్
నిన్న అర్దరాతర్ి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం, ఆయన వెంటనే సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే... నిన్నటి వరకూ... కాంగ్రెస్, శివసేనతో కలిసిన ఎన్సీపీ... రాత్రికి రాత్రి పార్టీలో చీలిక రావడంతో... ప్లేట్ తిప్పేసింది. వెంటనే బీజేపీతో చేతులు కలిపింది. దాంతో... మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనట్లైంది. మరోవైపు ఇండిపెండెట్లు, శివసేనలో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి టచ్‌లో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఐతే... ఈ విషయం తెల్లారే వరకూ బయటకు తెలియనివ్వకుండా బీజేపీ జాగ్రత్తపడి... శివసేన రాజకీయాలకు బ్రేక్ వేసింది. ప్రధాని మోదీ... ఫడ్నవీస్, అజిత్ పవార్‌కి శుభాకాంక్షలు తెలిపారు.మొత్తానికి మహారాష్ట్రలో శివసేన ఎత్తులకు పై ఎత్తులు వేసి ఆ పార్టీని అనుకోని షాకిచ్చింది బీజేపీ. రాజ్యసభలో ప్రధాని మోదీ.. ఎన్సీపీని పొగిడిన తర్వాత.. పార్లమెంటులో NCP నేత శరద్ పవార్.. ప్రధాని మోదీని కలిసి తర్వాతే.. మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు మారాయి. మహారాష్ట్రలో ఓ సీఎం పూర్తిస్థాయిలో పరిపాలించి, మళ్లీ ఆయనే సీఎం అయిన సందర్భం ఇదివరకు లేదు. ఆ రికార్డు ఫడ్నవీస్‌కి దక్కినట్లైంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 23, 2019, 8:59 AM IST