Modi Birth Day Celbrations: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minster Modi) పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (Barathiy Janata Party) శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ (BJP) భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు.
ముఖ్యంగా ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. బీజేపీ శ్రేణులు చేపట్టిన కార్యక్రమ వివరాలు ఇవే. మోదీ జీవిత చరిత్రపై ప్రత్యేక ఎగ్జిబిషన్‌లు, నమో యాప్‌లో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తారు. మేధావులు, ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 71 చోట్ల గంగా నది ప్రక్షాళన కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్య, రక్తదాన శిబిరాల నిర్వహణ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నిత్యవసరాల పంపిణీ లపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఖాదీ, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే సందేశం ఇవ్వనున్నారు. కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లల గుర్తించి.. పీఎం-కేర్స్ నిధులతో ఆదుకునేలా చర్యలు చేపట్టనున్నారు. నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Modi, Narendra modi, National News