వాళ్లతో సంబంధమే లేదు.. ఏపీపై బీజేపీ పెద్దల క్లారిటీ

2024లో అధికారమే లక్ష్యంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. అవినీతి, రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడిలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 5:01 PM IST
వాళ్లతో సంబంధమే లేదు.. ఏపీపై బీజేపీ పెద్దల క్లారిటీ
సునీల్ దేవధర్
  • Share this:
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన, బీజేపీ మధ్య కొత్త పొత్తు పొడిచింది. ఏపీ భవిష్యత్తు కోసం 2024లో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేస్తాయని ఇరుపార్టీలు తెలిపాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ పార్టీలపై ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తామని.. టీడీపీ, వైసీపీలతో పొత్తు ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన బంగారు ఆంధ్రప్రదేశ్‌ని నిర్మిస్తామని చెప్పారు సునీల్.

సంక్రాతి సమయంలో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. రాత్రి సమయం తగ్గి పగటి సమయం పెరుగుతుంది. సంక్రాంతి వేళ జరిగిన ఈ పొత్తు కూడా రాష్ట్రంలో నెలకొన్ని చీకట్లను తరమేసి వెలుగులు నింపుతుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ ఫెయిలయ్యారు. చంద్రబాబు ఇప్పటికే విఫలమయ్యారు. టీడీపీ, వైసీపీలతో పొత్తు ఉండదు. ఆ రెండు పార్టీలతో ఎలాంటి సంబంధాలు ఉండబోవు.
సునీల్ దేవధర్


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కుటుంబ పాలన, అవినీతి పాలన, కులపాలన అనే మూడు గ్రహణాలు పట్టి పీడిస్తున్నాయని.. వాటిని అంతమొందించి, బంగారు ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామన్నారు సునీల్. 2024లో అధికారమే లక్ష్యంగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. అవినీతి, రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడిలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>