Maharashtra Assembly Results | బీజేపీ, శివసేన... మధ్యలో సీఎం పీఠం

Maharashtra Assembly Results | మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య సీఎం సీటు కోసం పోటీ నెలకొనే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: October 24, 2019, 11:21 AM IST
Maharashtra Assembly Results | బీజేపీ, శివసేన... మధ్యలో సీఎం పీఠం
మోడీతో ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి మరోసారి విజయం సాధించడం ఖాయమైంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 145 సీట్ల మార్క్‌ను దాటిన ఈ రెండు పార్టీల కూటమి... మహారాష్ట్ర అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ సారి మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీ, శివసేనలో ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అదృష్టం కలిసొచ్చి బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు దక్కితే మరాఠా పీఠం తమ సొంతమవుతుందని భావించిన శివసేన... ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే వర్లి నుంచి తొలిసారి అసెంబ్లీ సీటుకు పోటీ చేశారు.

బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఆదిత్య థాక్రే డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం అప్పుడే మొదలైంది. అయితే తాజాగా శివసేనకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో సీఎం సీటు తమకే ఇవ్వాలనే డిమాండ్‌ను శివసేన తెరపైకి తీసుకురానుందని తెలుస్తోంది. మరోవైపు శివసేనకు బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని... మళ్లీ మహారాష్ట్ర బీజేపీ సీఎం స్థానం తమదే అని బీజేపీ నేతలు ధీమా ఉన్నారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో పోటాపోటీగా శివసేన సీట్లు సాధిస్తే మాత్రం... రెండు పార్టీలు సీఎం సీటు కోసం హోరాహోరీగా తలపడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published: October 24, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading