మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..

మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని అమిత్ షా చెప్పినట్టు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.

news18-telugu
Updated: November 17, 2019, 9:02 PM IST
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..
ఉద్ధవ్ థాక్రే, అమిత్ షా (File)
  • Share this:
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్టు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చి వేరు దారులు చూసుకున్న తరుణంలో మళ్లీ రెండు పార్టీలు కలుస్తాయని.. అమిత్ షా ధీమా వ్యక్తం చేసినట్టు అథవాలే చెప్పారు. ‘బీజేపీ - శివసేన మధ్య మధ్యవర్తిత్వం నెరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను అమిత్ షాతో చెప్పా. అయితే, ‘డోంట్ వర్రీ. అంతా సర్దుకుంటుంది.’ అని అమిత్ షాచెప్పారు’ అని అథవాలే చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల శివసేన మీద స్పందించిన అమిత్ షా.. ఎన్నికలకు వెళ్లే ముందు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా తమకు ఆమోదయోగ్యం కాదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు అలవికాని డిమాండ్లు తెరపైకి తెచ్చారని అమిత్ షా ప్రశ్నించారు.

రెండున్నరేళ్లు తమకు సీఎం పదవి కావాల్సిందేనంటూ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. ఆ పార్టీ మీద నిన్న తీవ్ర విమర్శలు గుప్పించింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కమలం నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వారు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2019, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading