చంద్రబాబుకు షాక్... కీలక భేటీకి బీజేపీ, సీపీఎం దూరం

టీడీపీ ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీజేపీ, సీపీఏం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

news18-telugu
Updated: December 5, 2019, 11:42 AM IST
చంద్రబాబుకు షాక్... కీలక భేటీకి బీజేపీ, సీపీఎం దూరం
చంద్రబాబు (File)
  • Share this:
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విజయవాడలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని పార్టీలు హాజరుకావాలని టీడీపీ కోరింది. అయితే బీజేపీ, సీపీఎం నేతలు ఈ సమావేశానికి హజరుకాకుండా చంద్రబాబుకు ఝలక్‌ ఇచ్చారు. సీపీఎం సైతం చంద్రబాబు తీరును తప్పుబట్టింది. రాజధాని రైతులు, రైతు కూలీలను చంద్రబాబు మోసం చేశారని సీపీఎం విమర్శించింది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమ సిద్ధాంతం అని వెల్లడించింది. ఏపీ రాజధాని అంశం వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు.. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ భేటీకి సీపీఎం హాజరు కావడం లేదని తెలిపారు.

వికేంద్రీకరణ ప్రాతిపదిక మీద రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలని ఆయన అన్నారు.. హైదరాబాద్‌ రాజధాని సందర్భంగా జరిగిన తప్పిదాలె మరోసారి జరగొద్దని ఆయన స్పష్టం చేశారు. పవన్‌ కల్యాన్‌ మతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాట మీద నిలబడని వ్యక్తి పవన్‌ కళ్యాణ్ అని విమర్శించారు. ఆయన బీజేపీ, అమిత్‌ షాలను పొడగటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఏపీలో జనసేన మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>