BJP ALLY RASHTRIYA LOKTANTRIK PARTY QUITS NDA OVER FARM REFORMS SK
RLP quits NDA: బీజేపీకి బిగ్ షాక్.. ఎన్డీయే నుంచి మరో మిత్రపక్షం ఔట్
ప్రతీకాత్మక చిత్రం
RLP quits NDA: ఢిల్లీ సరిహద్దులోని షాజహాన్‌పూర్ వద్ద రైతు సంఘాలతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు బేనీవాల్. ఈయన నాగౌర్ (రాజస్థాన్) పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే విపక్షాలు ముప్పేట దాడిచేస్తున్న సమయంలో.. బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు మరో మిత్ర పక్షం గుడ్‌బై చెప్పింది. ఎన్డీయేను వీడుతున్నట్లు రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ (RLP) అధినేత హనుమాన్ బేనీవాల్ ప్రకటించారు. రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవడం లేదని.. అందుకే ఎన్డీయేను వీడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ కేంద్రం కొత్త చట్టాలను రద్దు చేయకుండా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులోని షాజహాన్‌పూర్ వద్ద రైతు సంఘాలతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు బేనీవాల్. ఈయన నాగౌర్ (రాజస్థాన్) పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
I have left the NDA (National Democratic Alliance) in protest against the three farm laws. These laws are anti-farmer. I have left NDA but won't forge alliance with Congress: Rashtriya Loktantrik Party chief Hanuman Beniwal pic.twitter.com/luToWGTwa7
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఆ పార్టీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఏకంగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. రైతులకు మద్దతు తెలిపారు. తాజాగా మరో పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ మాజీ ఎంపీ హరిందర్ సింగ్ ఖల్సా బీజేపీకి ఇవాళ రాజీనామా చేశారు. కొత్త చట్టాలు వద్దని రైతులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం ఏ మాత్రం కనికరించడం లేదని ఆయన విమర్శించారు. రైతులతో పాటు వారి భార్యాపిల్లలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
మరోవైపు కేంద్రంతో మరో దఫా చర్చలకు రైతు సంఘాలు అంగీకారం తెలిపాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నేతలు తెలిపారు. కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానాలో టోల్‌ప్లాజా కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని..అవి తెరచుకునే ఉంటాయని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపారు. డిసెంబరు 30న సింఘూ సరిహద్దు వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కాగా, రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది. విపక్షాల ఉచ్చులో పడవద్దని రైతులకు సూచించింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారు. కొత్త చట్టాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు రైతు సంఘాల నేతలు అంగీకరించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.