బీజేపీకి షాక్ : పౌరసత్వ సవరణను సుప్రీంలో సవాల్ చేయనున్న మిత్రపక్షం

పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: December 15, 2019, 2:46 PM IST
బీజేపీకి షాక్ : పౌరసత్వ సవరణను సుప్రీంలో సవాల్ చేయనున్న మిత్రపక్షం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుపై బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. శనివారం గువాహటిలో పార్టీ అగ్ర నాయకులతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసోం గణపరిషత్‌కి చెందని ముగ్గురు సభ్యులు ఆదివారం ఢిల్లీ వెళ్లి రాజ్యాంగ నిపుణులు,సుప్రీంకోర్టు న్యాయవాదులను కలవనున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో మద్దతునిచ్చిన అసోం గణపరిషత్.. స్థానిక ప్రజల ఆగ్రహావేశాలతో యూటర్న్ తీసుకోక తప్పలేదు.

కాగా,పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపొందడంతో అసోం అగ్ని గుండంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ఫ్యూలను సైతం లెక్క చేయకుండా ప్రజలు రోడ్ల పైకి,వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు ఫైరింగ్ కూడా జరుపుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఆరుగురు అసోం ప్రజలు చనిపోయారు. మున్ముందు ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది.


First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు