ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు

రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయల్దేరుతారు. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

news18-telugu
Updated: July 20, 2019, 12:49 PM IST
ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్
  • Share this:
ఏపీ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఈనెల 23న కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్నారు విశ్వభూషణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకొని అనంతరం విజయవాడకు బయల్దేరనున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సంగతి తెలిసిందే. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయల్దేరుతారు. మరుసటి రోజు (24వ తేదీ) గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>