• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIHAR UNPRECEDENTED CHAOS IN ASSEMBLY OPPOSITION MLAS THRASHED SU

Bihar Assembly: రణరంగాన్ని తలపించిన అసెంబ్లీ.. విపక్ష ఎమ్మెల్యేలను బయటకు లాగేసిన పోలీసులు..

Bihar Assembly: రణరంగాన్ని తలపించిన అసెంబ్లీ.. విపక్ష ఎమ్మెల్యేలను బయటకు లాగేసిన పోలీసులు..

Image-Twitter

బిహార్ అసెంబ్లీ గతంలో ఎన్నడూ లేనివిధంగా రణరంగాన్ని తలపించింది. విపక్ష ఎమ్మెల్యేలను సభలో నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో పోలీసులువారిపై చేయి చేసుకున్నారు.

  • Share this:
    బిహార్ అసెంబ్లీ గతంలో ఎన్నడూ లేనివిధంగా రణరంగాన్ని తలపించింది. స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను నిలువరించే విషయంలో మార్షల్స్‌కు సహకరించేందుకు సభలోకి పోలీసులను పిలిపించారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని బయటకు ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని సాయుధ పోలీసు బలగాలను మరిన్ని అధికారాలను కల్పించే బిహార్‌ స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బిల్లు-2021 ను తీసుకొచ్చింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేపట్టాయి. వారెంటు లేకుండా పోలీసులు ఎక్కడైనా తనిఖీ చేసేలా, ఎవరినైనా అరెస్టు చేసేలా అధికారమిచ్చే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

    అయితే మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీలు సభలో నుంచి వాక్ అవుట్ చేసిన సమయంలో సభలో ఈ బిల్లను ఆమోదించారు. అయితే ఆ తర్వాత సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. శాసనసభలో స్పీకర్ తన చైర్ వద్దకు వెళ్లకుండా విపక్షాలకు చెందిన మహిళ సభ్యలు పొడియంను చుట్టూ చేరారు. మరోవైపు వెల్‌లోకి వచ్చిన ఇతర విపక్ష సభ్యులు అక్కడ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే సభలో కొందరు అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య వాగ్వాదం జరిగింది. సభను అదుపు చేయడం కష్టంగా మారడంతో సభను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేశారు.





    ఈ క్రమంలోనే సభలోని ఆర్జేడీతో పాటు ఇతర విపక్ష సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. వారికి సహకరించేందుకు పోలీసులను కూడా లోనికి తీసుకొచ్చారు. దీంతో మార్షల్స్, పోలీసులు విపక్ష సభ్యులను బయటకు తీసుకెళ్లే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. కొందరు పోలీసులు ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని సభలో నుంచి బయటకు లాక్కుని వెళ్లారు. మహిళ ఎమ్మెల్యేల పట్ల ఇలాగే ప్రవర్తించారు. మహిళా సిబ్బంది వారి జట్లు పట్టి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యే గాయపడగా, కొందరు స్పృహ కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను షేర్ చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. నితీశ్ కుమార్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
    Published by:Sumanth Kanukula
    First published: