హోమ్ /వార్తలు /రాజకీయం /

అందముంది..ట్యాలెంట్ లేదు...ప్రియాంకపై బీహార్ మంత్రి ‘సెక్సీ’ కామెంట్స్

అందముంది..ట్యాలెంట్ లేదు...ప్రియాంకపై బీహార్ మంత్రి ‘సెక్సీ’ కామెంట్స్

ప్రియాంక గాంధీ(న్యూస్18 క్రియేటివ్)

ప్రియాంక గాంధీ(న్యూస్18 క్రియేటివ్)

ప్రియాంక గాంధీకి దేవుడు చాలా అందం ఇచ్చాడు...అయితే ఆమెకు ట్యాలెంట్ లేదని బీహార్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వినోద్ నారాయణ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

  ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వినోద్ నారాయణ్ ఝా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రియాంక గాంధీకి చాలా అందమైతే ఉందిగానీ, ట్యాలెంట్ లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి అనుభవం లేదని ఎద్దేవా చేశారు. ఈస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీ రెండ్రోజుల క్రితం నియమితులుకావడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


  ఆమెకు 37-38 ఏళ్లు లేదా గరిష్ఠంగా 44 ఏళ్ల వరకు ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆమె సాధించిందేమీ లేదు. చూసేందుకు మాత్రం ఆమె అందంగానే ఉంటుంది. దేవుడు ఆమెకు అది ఇచ్చాడు. అయితే ఆ అందంతో ఆమె రాజకీయాల్లో ఏమి చేయగలుగుతుంది అంటూ వినోద్ నారాయణ్ కామెంట్స్ చేశారు.


  అందాన్ని చూపి ఓట్లను సాధించలేరని వ్యాఖ్యానించారు. పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకు ఆమె భార్యగా ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి చేసిన ఈ కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.


  మరోవైపు కళంకితుడి జీవిత భాగస్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సునీల్ కుమార్ మోడీ ఎద్దేవా చేశారు.

  First published:

  Tags: Priyanka Gandhi

  ఉత్తమ కథలు