ఆ బీహార్ నేతల పాడు అలవాట్లు ఏంటో తెలుసా..?

సాధారణంగా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు నేతలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటారు. కానీ బీహార్ కు చెందిన నేతల్లో ఎక్కువ మాత్రం పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయా పార్టీల కార్యకర్తలే స్వయంగా చెబుతున్నారు.

news18-telugu
Updated: April 13, 2019, 10:57 PM IST
ఆ బీహార్ నేతల పాడు అలవాట్లు ఏంటో తెలుసా..?
సాధారణంగా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు నేతలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటారు. కానీ బీహార్ కు చెందిన నేతల్లో ఎక్కువ మాత్రం పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయా పార్టీల కార్యకర్తలే స్వయంగా చెబుతున్నారు.
  • Share this:
సార్వత్రిక ఎన్నికల వేళ నేతలంతా బిజీబిజీగా ఉంటారు. హడావిడితోనూ ఒత్తిడికి గురవుతూ ప్రచారంలో తిరుగుతుంటారు. సాధారణంగా ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు నేతలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటారు. కానీ బీహార్ కు చెందిన నేతల్లో ఎక్కువ మాత్రం పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయా పార్టీల కార్యకర్తలే స్వయంగా చెబుతున్నారు.

ముఖ్యంగా బీహార్ కు చెందిన నేతల్లో ఎక్కువగా ఖైనీ (నమిలే పొగాకు) ఎక్కువగా తీసుకుంటున్నారు. ఖైనీ తీసుకుంటే శక్తి వస్తుందని, తద్వారా చురుగ్గా పనిచేస్తామని జేడీయూ సునీల్ సింగ్ చెబుతున్నారు.

అలాగే ఖైనీని ఎక్కువగా సున్నంతో కలిపి తీసుకుంటారు. బీహార్ లో ఎక్కువ మంది ఖైనీ రూపంలో పొగాకు తీసుకునేందుకు ఇష్ట పడతారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆర్ఎల్డీ, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు ఖైనీ ఎక్కువగా తీసుకుంటున్నారు.

ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఖైనీ తీసుకోవడంలో ఎలాంటి మొహమాటం పడరు. పబ్లిగ్గా అందరి ముందే ఆయన ఖైనీ స్వీకరిస్తుంటారు. ఎంత మంది ఉన్నా సరే లాలూ తన సహజ శైలిని కోల్పోరని ఆయన పార్టీ నేతలు చెబుతుంటారు. అలాగే బీహార సీఎం నితీష్ కుమార్ సైతం ఖైనీ స్వీకరిస్తారని, అయితే పబ్లిగ్గా తీసుకోరని జేడీయూ నేతలు అంటుంటారు. ఎన్నికల కాంపెయిన్ మధ్యలో నితీష్ ఖైనీ తీసుకునేందుకు ఇష్టపడతారని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే చాలా కొద్ద మందికి మాత్రమే ఈ విషయం తెలుసని అంటున్నారు.

ఇదిలా ఉంటే గత సంవత్సరం నితీష్ ప్రభుత్వం ఖైనీ బ్యాన్ చేద్దామని ప్రయత్నం చేసింది. అయితే తీవ్ర నిరసనల నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో అటు నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఖైనీ ఎక్కువగా తీసుకోవడంతో పొగాకు డిమాండ్ ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది.
First published: April 13, 2019, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading