బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నుమూత

రాజకీయాల్లోకి రాకముందు జగన్నాథ్ మిశ్ర లెక్చరెర్‌గా పనిచేశారు. బీహార్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు.

news18-telugu
Updated: August 19, 2019, 12:59 PM IST
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నుమూత
జగన్నాథ్ మిశ్రా, బీహార్ మాజీ సీఎం
  • Share this:
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మిశ్రా వయసు 82 ఏళ్లు. బీహార్ ముఖ్యమంత్రిగా మిశ్రా మూడుసార్లు ఎన్నికయ్యారు. తొలిపారి 1975లో ఆయన బీహార్ సీఎంగా గెలుపొందరు. ఆ తర్వాత 1980లో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 1990 వరకు ఆయన సీఎంగా బీహార్ ప్రజలకు సేవలు అందించారు. ఆ తర్వత కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లోకి రాకముందు జగన్నాథ్ మిశ్ర లెక్చరెర్‌గా పనిచేశారు. బీహార్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో మిశ్రా అర్థశాస్త్రంలో ఆయన 40కు పైగా రీసెర్చ్ రిపోర్టులను సైతం సిద్దం చేశారు.

2018లో మిశ్రా భార్య వీణా(72) అనారోగ్య కారణంగా చనిపోయారు. కాంగ్రెస్‌లో మిశ్రా సుదీర్ఘ కాలం కీలక నేతగా కొనసాగారు. బీహార్ 14వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన జేడీయూలో చేరారు.జగన్నాథ్ మిశ్రా మరణం పట్ల బీహార్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన గౌరవార్థం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు