కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఐటీ దాడులు.. బీజేపీ ఓటమిని అంగీకరించిందన్న ఆర్జేడీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ.. అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాష్ట్ర రాజధాని పట్నాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు నిర్వహించారు.

news18-telugu
Updated: October 23, 2020, 9:11 AM IST
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఐటీ దాడులు.. బీజేపీ ఓటమిని అంగీకరించిందన్న ఆర్జేడీ
కాంగ్రెస్ కార్యాలయంపై ఐటీ దాడులు(Photo-ANI)
  • Share this:
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ.. అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ అధికారులు రాష్ట్ర రాజధాని పట్నాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వెలుపల పార్క్ చేసిన వాహనంలో రూ. 8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. అలాగే ఎవరి వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారో ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, కాంగ్రెస్ కార్యాలయంపై ఐటీ దాడులకు సంబంధించి బిహార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శక్తిసిన్హ్ గోహిల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎటువంటి డబ్బును అధికారులు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు.

"పార్టీ కార్యాలయం కాంపౌండ్‌కు వెలువల పార్క్ చేసిన ఓ వాహనంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నందుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారు. పార్టీ కార్యాలయం కాంపౌండ్‌లో ఎలాంటి డబ్బులు లభించలేదు. మేము ఐటీ అధికారులకు సహకరిస్తాం. రాక్సెల్‌ బీజేపీ అభ్యర్తి నుంచి 22 కిలోల బంగారం, 2.5 కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. మరి ఐటీ అధికారులు ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్లరు?" అని ప్రశ్నించారు. మరోవైపు ఈ దాడులను కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ, జేడీయూ కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆదాయపు పన్ను శాఖ.. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేస్తుందంటే దాని అర్థం.. వాళ్లు ఓటమిని అంగీకరించినట్టేనని వ్యాఖ్యానించింది.

ఫస్ట్‌ ఫేజ్ పోలింగ్‌కు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతిపక్ష ఆర్జేడీ.. తాము అధికారంలో వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ ఆ హామీని తలదన్నెలా 19 లక్షలు ఉద్యోగాలు, బిహార్ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా అందజేస్తామని వారి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ హామీ ఇవ్వడంపై.. బిహార్‌లోని ప్రతిపక్షాలే కాకుండా, దేశంలో పలు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణాలను కాపాడే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల్లో ఓట్లకు ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇక, 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో అక్టోబర్ 28, రెండో దశలో నవంబర్ 3న, మూడో దశలో నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 10 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తొలి దశలో ఎన్నికలు జరగనున్న 71 స్థానాల నుంచి 1064 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading