• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • BIHAR ELECTIONS BJP PROMISING FREE COVID VACCINE AND 19 LAKH JOBS SU

మేము గెలిస్తే ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్లు..ఎన్నికల మ్యానిఫెస్టోలో BJP హామీ

మేము గెలిస్తే ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్లు..ఎన్నికల మ్యానిఫెస్టోలో BJP హామీ

బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఒక పార్టీని మించి మరో పార్టీ బిహార్ ప్రజానీకంపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

 • Share this:
  బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఒక పార్టీని మించి మరో పార్టీ బిహార్ ప్రజానీకంపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఆ హామీని తలదన్నేలా బీజేపీ తమ మేనిఫెస్టోను రూపొందించింది. సంకల్ప పాత్ర పేరిట మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ.. 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది(ఇది తేజస్వి చెప్పినదానికంటే దాదాపు రెండితలు). అలాగే రాష్ట్రంలోని ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందివ్వనున్నట్టు చెప్పింది. అన్ని అనుమతులు పొంది వ్యాక్సిన్ ప్రభుత్వం వద్దకు చేరాక.. ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బిహార్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

  తొలి సంవత్సరం మూడు లక్షల టీచర్ జాబ్‌లను భర్తీ చేయనున్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో తెలిపింది. ఐటీ సెక్టార్‌లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించి బిహార్‌ను ఐటీ హాబ్‌గా మార్చనున్నట్టు చెప్పింది. మెడికల్ సెక్టార్‌లో లక్ష ఉద్యోగాలు, వ్యవసాయ రంగంలో పదిలక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 2022 లోపు 30 లక్షల పక్కా ఇళ్లను నిర్మాణం చేపట్టనున్నట్టు, కోటి మంది మహిళలను ఆర్థిక లబ్ధి చేకూరేలా రూ. 50వేల కోట్లతో మైక్రో ఫైనాన్స్ సంస్థలను విస్తరిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది.

  అయితే ఆర్జేడీ మేనిఫెస్టోలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడంపై డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఎన్నికల్లో లబ్ది పొందడానికే మాత్రమే చేస్తున్న వాగ్దానమని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ. 52,734 కోట్లు ఖర్చవుతుందని, ఇప్పుడు మరో 10 లక్షల మందికి ఉద్యోగాలంటే ఆ మొత్తం రూ. 1.11 లక్షల కోట్లు అవుతుందని సుశీల్ మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్జేడీ అలా చేస్తే చాలా మొత్తం జీతాలకే వెళుతుందని.. మరీ అలాంటప్పుడు పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, సైకిల్స్, యూనిఫాం, రైతుల సబ్సిడీ, మధ్యాహ్న బోజనం వంటి వాటి ఖర్చులు ఎలా చెల్లించగలుగుతున్నారని ప్రశ్నించారు.

  మరోవైపు తేజస్వి ఉద్యోగ హామీని సీఎం నితీశ్ కుమార్ కూడా తప్పుబట్టారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తే.. వారి జీతాలు చెల్లించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. మీరు ఫేక్ డబ్బులను ప్రింట్ చేస్తారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ఈ విమర్శలను తేజస్వి కూడా అంతే బలంగా తిప్పికొట్టారు. ఇక, ఆర్జేడీ ఉద్యోగ హామీపై బీజేపీ, జేడీయూ నేతలు విమర్శలు చేయగా.. ఇప్పుడే అంతకు రెట్టింపు సంఖ్యలో బీజేపీ ఉద్యోగాల హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మరింది. ఇది బీజేపీపై విమర్శలు చేయడానికి ఆర్జేడీకి ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణలు అంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు