BIHAR ELECTIONS 2020 ELECTION COMMISSION OF INDIA ANNOUNCED ASSEMBLY ELECTION SCHEDULE SK
Bihar Elections 2020: బీహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. పోలింగ్ తేదీలు ఇవే
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా తెలిపారు. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
బీహార్‌లో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్‌తో పాటు 16 రాష్ట్రాల్లోని 56 నియోజకవర్గాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా తెలిపారు. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.
Bihar to vote in 3 phases on 28th October, 3rd and 7th November; results on 10th November, announces Election Commission #BiharPollspic.twitter.com/8KpZBkv0V4
కరోనా నేపథ్యంలో .. ఎన్నికల ప్రచారం మొదలు.. ఓటింగ్ వరకు.. ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లోనే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నారు. సామాజిక దూరం పాటించేందుకు వీలైనన్ని ఎక్కువ పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను అందుబాటులో ఉంచరుతారు. 46 లక్షల మాస్క్‌లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7 లక్షల శానిటైజర్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్స్, 23 లక్షల హ్యాండ్ గ్లవ్స్ అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంగ్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మాస్క్ ఉన్న వారిని మాత్రమే ఓటింగ్‌కు అనుమతిస్తారు. చివరి గంటలో కోవిడ్ రోగులకు ఓటువేసే అవకాశం కల్పిస్తారు.
కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి, అతిపెద్ద ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబరు 29తో ముగియనుంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లున్నాయి. ఇందులో 38 సీట్లు ఎస్సీలు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, భాజపాతో కలిపిన ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 82, జేడీయూ 73, బీజేపీ 53, కాంగ్రెస్ 2, ఎల్జేపీ 2, RLSP 2, HMM 1 స్థానం గెలించింది. జేడీయూ అధినేత, సీఎంనితీశ్ కుమార్ ఈసారి కూడా ఎన్డీయే నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఇక బీజేపీ-జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సిద్ధమవుతున్నాయి.