Bihar Elections 2020: బీహార్‌లో ఓవైసీ దూకుడు.. 6 పార్టీలతో కొత్త కూటమి

మహా ప్రజాస్వామిక లౌకిక కూటమిలో MIM, RSLPతో పాటు BSP, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ జనతా దళ్ (డెమొక్రటిక్), జనతంత్రిక్ పార్టీ (సోషలిస్ట్) పార్టీలు ఉన్నాయి. కూటమి సీఎం అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వాహ పేరును ప్రకటించారు.

news18-telugu
Updated: October 9, 2020, 8:00 AM IST
Bihar Elections 2020: బీహార్‌లో ఓవైసీ దూకుడు.. 6 పార్టీలతో కొత్త కూటమి
అసదుద్దీన్ ఓవైసీ
  • Share this:
ఎన్నికలు సమీపించే కొద్దీ బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీహార్‌లో కొత్తు పొత్తులు పొడిచ్చాయి. ఎన్డీయే, మహా కూటమికి పోటీగా అక్కడ మరో కొత్త కూటమి తెరపైకి వచ్చింది. అదే మహా ప్రజాస్వామిక లౌకిక కూటమి (Grand Democratic Secular Front). ఈ కూటమిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (RSLP) నేత ఉపేంద్ర కుశ్వాహ గురువారం ప్రకటించారు. మహా ప్రజాస్వామిక లౌకిక కూటమిలో MIM, RSLPతో పాటు BSP, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ జనతా దళ్ (డెమొక్రటిక్), జనతంత్రిక్ పార్టీ (సోషలిస్ట్) పార్టీలు ఉన్నాయి. ఈ కూటమికి సమాజ్‌వాదీ జనతా దళ్ డమొక్రటిక్ నేత దేవేంద్ర ప్రసాద్ యాదవ్ కన్వీనర్‌‌గా ఉంటారు. ఇక కూటమి సీఎం అభ్యర్థిగా ఉపేంద్ర కుశ్వాహ పేరును ప్రకటించారు. మొదటి దశలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే కూటమి తరపున పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశారు.

243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలు జేడీయూ, బీజేపీ సీట్ల పంపకం పూర్తయింది. ఈ ఎన్నికల్లో జేడీ(యూ) 122, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఈ కూటమిలో మరో రెండు పార్టీలూ ఉన్నాయి. జీతన్ రామ్ మాంఝీ నేతృత్వం వహిస్తున్న హిందూస్తానీ అవాం మోర్చా (HAM) ఏడు సీట్లలో పోటీ చేయనుంది. దీనికి జేడీ(యూ)కు కేటాయించిన 122 సీట్ల నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇక బీజేపీ తన 121 సీట్ల నుంచి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (VSIP)కి ఆరు సీట్లు కేటాయించనుంది. ఈ లెక్కన చూస్తే.. రాబోయే ఎన్నికల్లో జేడీ (యూ) సొంతంగా 115 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుండగా.. బీజేపీ 116 సీట్లలో పోటీ పడనుంది. ఇక మహా కూటమిలో ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎల్జేపీ (Lok Janashakthi Party) ఒంటరిగా పోటీచేస్తుంది.

బీహార్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.

కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి, అతిపెద్ద ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. బీహార్‌ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబరు 29తో ముగియనుంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లున్నాయి. ఇందులో 38 సీట్లు ఎస్సీలు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, భాజపాతో కలిపిన ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ 82, జేడీయూ 73, బీజేపీ 53, కాంగ్రెస్ 2, ఎల్జేపీ 2, RLSP 2, HMM 1 స్థానం గెలించింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌ ఈసారి కూడా ఎన్డీయే నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాయి. ఇక బీజేపీ-జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 7:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading