బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అధిక్యంలో ఉండటంతో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులు అధిక్యంలోకి వెళ్లడంతో తీవ్ర నిరాశ చెందినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్.. అక్కడి కెల్లీ బంగ్లా లాన్లో ఉండి ఉదయం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్నారు. అయితే ముందస్తు ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి అధిక్యం కనబరచడంతో ఆయన టీవీ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మహాకూటమి తరఫును సీఎం అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికి కొంత మొగ్గు ఉంటుందని చెప్పినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం ఎన్డీయే కూటమి అధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను చూస్తే ఎన్డీయే 126 స్థానాలు అధిక్యం/గెలుపు, మహాకూటమి 107 స్థానాలు అధిక్యం/గెలుపు, లోక్‌జన్‌శక్తి పార్టీ 03 అధిక్యం/గెలుపు, ఇతరులు 8 స్థానాలు అధిక్యం/గెలుపు కొనసాగుతున్నారు. ఇక, ఈ రోజు రాత్రి వరకు బీజేపీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు.
ఇక, దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుంచి జైలులోనే ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.