Bihar Elections: బీహార్ లో మొదటి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. తొలి సమరానికి సిద్ధమైన పార్టీలు

Bihar Elections: బీహార్ లో తొలి దశ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచారం సోమవారం ముగిసింది.

news18-telugu
Updated: October 26, 2020, 6:45 PM IST
Bihar Elections: బీహార్ లో మొదటి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. తొలి సమరానికి సిద్ధమైన పార్టీలు
ఫైల్ ఫోటో
  • Share this:
బీహార్ లో తొలి దశ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో హోరా హోరీగా సాగిన ప్రచారం సోమవారం ముగిసింది. మొత్తం 71 స్థానాలకు మొదటి విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను అరెస్టు చేస్తామంటూ ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ప్రచారం చివరలో వాఖ్యానించడం రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ, జనతాదళ్ యునైటెడ్ మరో కూటమిగా పోటీకి దిగాయి. ఇతర చిన్న పార్టీలు సైతం బరిలో నిలిచాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని మోదీ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. నితీష్ కుమార్ కు మరో సారి అధికారం ఇవ్వాలని ఓటర్లను ఆయన కోరారు. కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించకుండా వివిధ పార్టీల ప్రచారం సాగింది. అనేక సభల్లో మాస్కులు, సామాజిక దూరం ఎక్కడా కానరాలేదు.

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ బీహార్ లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. బీహార్ ఎన్నికలకు రెండు రోజుల ముందు లోక్ జనశక్తి పార్టీ నేత చీరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కు జైలే సరైన స్థలమని భావిస్తున్నానంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ పాలనలో ఈ ఐదేళ్లలో అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని గతంలో ఆయన వాఖ్యానించడం తెలిసిందే. ఈ అంశంపై పాశ్వాన్ మరోసారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులు, ఇతరులు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదన్నారు.

ఈ విషయాన్ని తాను, ప్రజలు నమ్ముతున్నామన్నారు. అవినీతికి పాల్పడే వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేననన్నారు. అవినీతి చేసే నాయకులెవరైనా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించరాన్నారు.  రాష్ట్రంలో చేపట్టిన మద్యాపన నిషేధంపై సైతం పాశ్వాన్ విమర్శలు గుప్పించారు. అవినీతికి కేంద్రంగా ఆ ప్రాజెక్టు మారిందని ధ్వజమెత్తారు. బీహార్‌లో మద్యం అక్రమ రవాణాదారులు లేరా? బీహార్‌లోకి మద్యం అక్రమ రవాణా చేయలేదా? అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసంటూ దుయ్యబట్టారు.

నితీష్ ఫ్రీ బీహార్ అంటూ #nitishmuktBihar అన్న ట్యాగ్ తో ట్విట్టర్ లో పాశ్వాన్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ నెల 28న బీహార్ లో మొదటి మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3,7 తేదీల్లో మరో రెండు దశల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి నుంచి లోక్ జనశక్తి పార్టీ బయటకు వచ్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు బీజేపీ-జేడీయూ ఒక కూటమిగా, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, లెఫ్ట్ మరో కూటమిగా పోటీ పడుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading