‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ నటీనటులపై ఎఫ్ఐఆర్‌... బీహార్ కోర్టు ఆదేశం

The Accidental Prime Minister controversy | ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ సహా 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీహార్ కోర్టు ఆదేశించింది.

news18-telugu
Updated: January 8, 2019, 8:18 PM IST
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ నటీనటులపై ఎఫ్ఐఆర్‌... బీహార్ కోర్టు ఆదేశం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: January 8, 2019, 8:18 PM IST
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాను న్యాయమైన అడ్డంకులు వదిలేలా కనిపించడం లేదు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. తాజాగా ఈ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ సహా మరో 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీహార్‌లోని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సుధీర్ ఓజా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనుండగా...ఆయన మీడియా సలహాదారు సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు.

ఈ నెల 11న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు తనను బాధ పెట్టాయని ఓజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నాతో పాటు సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా పాత్రలను పోషించిన వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. అనేక మంది రాజకీయ ప్రముఖులను ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారని న్యాయవాది ఓజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షణ్ 295, 153 సహా పలు సెక్షన్లను ఉటంకిస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.

అంతకుముందు ఈ సినిమా ట్రైలర్‌పై బ్యాన్ విధించాలన్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై పిటిషనర్‌కు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది.

First published: January 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...