బీహార్‌లో ఎన్నికల వేడి...పొత్తులపై నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bihar Assembly polls 2020 | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై జేడీయు అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: March 1, 2020, 9:14 PM IST
బీహార్‌లో ఎన్నికల వేడి...పొత్తులపై నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్ సీఎం నితీశ్ కుమార్(ఫైల్ ఫోటో)
  • Share this:
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడిరాజుకుంటోంది. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు జరగనుండడంతో పొత్తుల చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల అంశంపై జేడీయు అధినేత, ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయేలో జేడీయు భాగస్వామ్యంగా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. పాట్నాలో జరిగిన జేడీయు శ్రేణుల సమావేశంలో మాట్లాడిన ఆయన...మొత్తం 243 స్థానాల్లో ఎన్డీయే కూటమి 200కు పైగా సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 2010నాటి ఫార్మెట్‌లోనే బీహార్‌లో ఎన్‌పీఆర్ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో తీర్మానం నెరవేర్చారని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో బీహార్ సాధించిన పురోగతి తనకు అత్యంత సంతృప్తిని ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రంగంలో దేశంలోని టాప్-5 రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.

అటు మహిళలపై నేరాలు పెచ్చుమీరడానికి పోర్న్ వెబ్‌సైట్లే కారణమని నితీశ్ కుమార్ పునరుద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా పోర్న్ సైట్స్‌ను బ్యాన్ చేసేందుకు దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. పోర్న్ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.

అక్టోబర్ మాసంలో బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది.
First published: March 1, 2020, 9:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading