news18
Updated: November 10, 2020, 7:44 AM IST
- News18
- Last Updated:
November 10, 2020, 7:44 AM IST
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ ఎన్నికల ఫలితం కొద్దిసేపట్లో తేలనుంది. పదిహేనేళ్లుగా బీహార్ ను పాలిస్తున్న నితీశ్ కుమార్ ‘ఈసారీ ఆ సీట్ నాదే..’ అనే ధీమాతో ఉండగా.. ‘మార్పు తప్పదు..’ అంటూ యువ తేజస్వి దూసుకొస్తున్నాడు. గెలవకున్నా పర్లేదు గానీ నితీశ్ ను మాత్రం సీఎం కానివ్వబోమని.. ఆ మేరకు తాము సక్సెస్ అయ్యామని ఎల్జేపీ చెబుతున్నది. నితీశ్ కు మద్దతిస్తూ.. ఈసారీ అధికారం చెలాయించాలని బీజేపీ భావిస్తున్నది. ప్రచారపర్వంలో అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, కౌగిలింతలు, చీదరింపులు, సత్కారాలు... జరగాల్సిన తతంగమంతా జరిగిపోయింది. కరోనా నేపథ్యంలో జరిగిన ఎన్నికలు అవడంతో వీటికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అందులో చాలా వరకు.. తేజస్వి యాదవ్ ఈసారి సీఎం సీటు సాధించడం ఖాయం అని చెప్పుకొస్తున్నాయి. మరికొన్ని ఎన్డేయే కు అనుకూలంగా వచ్చాయి. మరి బీహార్ కా బాద్ షా ఎవరు..?
యువ నాయకులు చక్రం తిప్పనున్నారా..? లేక తలపండిన రాజకీయ నాయకులే బీహార్ ను మళ్లీ ఏలుతారా..? కుల రాజకీయాలు వెలుగొందుతున్న బీహార్ లో గెలుపెవరిది..? అత్యంత కీలకంగా ఉన్న యాదవ్, కుర్మీ, రాజ్ పుత్ వర్గాలతో పాటు ముస్లింలు, అణగారిన వర్గాల ప్రజలు ఎవరికి ఓటు వేశారు..? కరువు కాటకాలు కరాళ నృత్యం చేసే బీహార్ లో.. పొట్ట చేత పట్టుకుని రైల్వే స్టేషన్ ల చుట్టూ తిరిగే వలస కార్మికుడు ఎవరిని కరుణించాడు..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈరోజే.
ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020
ఎగ్జిట్ పోల్స్, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఈసారి అక్కడ అధికార మార్పిడి తప్పేలా లేదని స్పష్టంగా తెలుస్తుంది. పదిహేనేళ్లుగా అక్కడ సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ కు ఈసారి శూణ్య హస్తాలు తప్పవని సర్వే రిపోర్డులు ఘంటాపథంగా చెబుతున్నాయి. ముఖ్యంగా సచ్చీలుడుగా పేరున్న నితీశ్ కు.. ఈసారి అక్కడ యువత ఆయన ఊహించని షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. యువమంత్రంతో దూసుకొస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు వారు జై కొట్టారని తెలుస్తున్నది.
ప్రతి 15 సంవత్సరాలకు బీహార్ రాజకీయాలు మారుతాయి. లాలూ-రబ్రీ ద్వయం 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించగా.. నితీశ్ కుమార్ 2005 నుంచి 2020 దాకా ఆ బాధ్యతల్లో ఉన్నారు. బీహార్ లో ఉన్న యువ ఓటర్లతో పాటు సామాజిక వర్గాలు తేజస్వికే జై కొట్టాయని అంటున్నారు. ఇదే విషయమై ఒక యువకుడు స్పందిస్తూ..‘నేను రాజ్పుత్ ను. గత ఆరేండ్లలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీకే ఓటేశాను. అయితే ఈసారి నేను తేజస్వి యాదవ్ కోసం ప్రచారం చేస్తున్నాను. నితీశ్ కుమార్ ను తొలిగించాలనుకుంటున్నాం. ఇది నేనొక్కన్ని అంటున్న మాట కాదు.. బీహార్ లో యువత మొత్తం ఇదే దృక్పథం తో ఉంది. మాకు ఉద్యోగాలు కావాలి. మూడు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. ప్రభుత్వంలో ఖాళీలు పేరుకుపోతున్నా.. నోటిఫికేషన్ లు విడుదల చేయడం లేదు’ అని అన్నాడు. ఇక తేజస్వి యదవ్ కూడా ప్రతి ర్యాలీలోనూ యువ మంత్రాన్నే జపించాడు. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అతడు హామీ ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం దాని మీదే పెడతానని వాగ్దానం చేశాడు.
ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020
బీహార్ లో నిరుద్యగో రేటు 10.3 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. అంతేగాక సీఎంఈఈ తాజా సర్వే ప్రకారం.. రాష్ట్ర నిరోద్యగ రేటు 31.2 శాతం పెరిగి.. 46.6 శాతానికి (2020 ఏప్రిల్ నాటికి) చేరింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో బీహార్ కు తిరిగొచ్చిన వలస కార్మికులకు ఇప్పటికీ అక్కడ ఉపాధి చూపించలేదు. ఆ ప్రభావం కూడా నితీశ్ పై పడింది. మరోవైపు నితీశ్ అంటేనే ఒంటికాలిమీద లేస్తున్న ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కూడా ఈసారి నితీశ్ కు ఎలాగైనా షాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు ఆయన సక్సెస్ అయినట్టే తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి:
Bihar Election Result 2020: నితీశ్ కుమార్ ప్లానేంటి... 4వ సారి సీఎం అవుతారా?
Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్లో గెలుపు ఎవరిది? నేడే జడ్జిమెంట్ డే
నితీశ్ తో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ) కూడా రాజకీయ ఉద్దండుడే. నితీశ్ ను పక్కకు జరిపి సీఎం అయ్యేందుకు ఆయనకూ ఆశలు లేకపోలేదు. కానీ నితీశ్ మీద ఉన్న ఆగ్రహం.. ఆయన ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నది. ఏదేమైనా బీహార్ లో లాంథరు వెలుగులు విరజిమ్ముతాయో లేక బాణం దెబ్బకు లాంథరు కకావికలమవుతుందో కొద్దిసేపు ఓపిక పట్టాల్సిందే.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 6:49 AM IST