Karate kalyani: సీఎం జగన్‌పై నటి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు..

త్వరలోనే తాను బీజేపీలో చేరతానని కరాటే కల్యాణి ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత.. అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 30, 2020, 1:55 PM IST
Karate kalyani: సీఎం జగన్‌పై నటి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్, కరాటే కల్యాణి
  • Share this:
తిరుమల డిక్లరేషన్ వివాదం ఇటీవల ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. క్రిస్టియన్ మతానికి చెందిన సీఎం జగన్ డిక్లరేషన్‌పై ఖచ్చితంగా సంతకం చేయాల్సిందేనని హిందూ సంఘాలు, బీజేపీ, టీడీపీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఐతే సీఎం జగన్ ఎలాంటి సంతకం చేయలేదు. సంప్రదాయ వస్త్రధారణలో.. నుదట తిరునామంతో.. కనిపించి.. తనను విమర్శించే వారికి ఆహార్యంతోనే సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఐతే తాజాగా డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి కరాటే కల్యాణి.

తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్‌ తప్పు చేశారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. ఎవరికైనా తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని స్పష్టం చేశారు. భారత పౌరురాలిగా ప్రశ్నించడం తన హక్కు అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు కల్యాణి. ''సీఎం జగన్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. ఆయన సీఎం అయినందున ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు. సీఎం అవ్వొచ్చు. పీఎం కావొచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి అడుగుపెట్టాలి. నాఇష్టం నేను వెళ్తా అంటే ప్రజలకు ఏం సందేశం అని? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అన్ని మతాలను గౌరవించాలి.'' అని కరాటే కల్యాణి అన్నారు.

ఇక త్వరలోనే తాను బీజేపీలో చేరతానని కరాటే కల్యాణి ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత.. అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు. జెరూసలేంకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ అడిగితే ఇస్తారు కదా.. మరి తిరుమలలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం తప్పని విమర్శించారు కల్యాణి. ఏపీలో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీ దేవుళ్ల జోలికి మేం రావడం లేదని.. మా దేవుళ్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న కరాటే కల్యాణి రెండు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు.

కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ సెప్టెంబరు 23, 24న తిరుమలలో పర్యటించారు. 23న సాయంత్రం పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా ఆలయం ప్రవేశం చేశారు. రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. మరుసటి రోజు ఉదయం కూడా కర్నాటక సీఎం యడియూరప్పతో కలిసి తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న సత్రాల సముదాయాలకు శంకుస్థాపన చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: September 30, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading