• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIG SHOCT TO TRS BEFORE DUBBAKA BYPOLLS CHERUKU SRINIVAS REDDY JOINS CONGRESS TO CONTEST IN ELECTION BA MDK

Dubbaka Bypolls: టీఆర్ఎస్‌కు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై, కాంగ్రెస్ నుంచి బరిలోకి

Dubbaka Bypolls: టీఆర్ఎస్‌కు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై, కాంగ్రెస్ నుంచి బరిలోకి

చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Cheruku Srinivas Reddy: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును రేపు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

  • Share this:
    దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాస్‌తో పాటు పలువురు ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు బంగారు భవిష్యత్ ఉండాలని ఉత్తమ్ కోరుకున్నారు. శ్రీనివాస్ తండ్రి ముత్యంరెడ్డి ఆదర్శ నాయకుడని.. దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఉత్తమ్ కొనియాడారు. దుబ్బాక ఉపఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని అని నియోజకవర్గ ప్రజలను ఉత్తమ్ కోరారు.

    చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక అని అన్నారు. దుబ్బాక కు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. పల్లెలు పట్నాలు వెళ్లకుండా -పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి అని అన్నారు. ఐదు మార్కెట్ యార్డ్ లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి చెందుతుందని చెప్పారు. ‘30 ఏళ్ళు ప్రజల కోసం ముత్యం రెడ్డి బతికితే టీఆరెస్ ముత్యంరెడ్డికి అవమానం రిటన్ గిఫ్ట్ ఇచ్చింది. నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే, ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి చెందుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటా.’ అని చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును రేపు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు. ‘శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఏం చేస్తున్నారో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాం. దుబ్బాక లో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావు కు రెండు కళ్ళు అంటున్నారు. మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

    2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతను ప్రకటించింది టీఆర్ఎస్ అధిష్టానం. అయితే, అక్కడ టికెట్ ఆశించిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి నిరాశ చెంది వెంటనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు