Ap Municiapal Elections Result:హిందూపురం ఫలితాల్లో అనూహ్య విజయం.. వైసీపీ, బాలయ్యకు షాక్ ఇచ్చిన మరో పార్టీ? ఏదో తెలుసా?

బాలయ్యకు షాక్

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఒకటి రెండు చోట్లకే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిమితం అయ్యింది. బాలయ్య సొంతం ఇలాకాలనూ ఫలితంలో తేడా కనిపించడం లేదు. వైైసీపీదే హవా కనిపిస్తోంది. అయితే అక్కడ ఒక వార్డులో ఎవరూ ఊహించని విధంగా మరో పార్టీ గెలుపొంది. దీంతో బాలయ్య, వైసీపీకి ఆ పార్టీ షాక్ ఇఛ్చినట్టు అయ్యింది.

  • Share this:
    ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు.. ఆ డివిజిన్ ఈ డివిజన్ అన్న లేక్క లేదు.. ఆ వార్డు ఈ వార్డు అన్నది పట్టించుకోలేదు.  మొన్న గ్రామ ఓటర్లు.. ఇప్పుడు పట్టన ఓటర్లు.. అయినా ఫలితం మారలేదు.  ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే వైసీపీ  ప్రభంజనమే అనుకోవాలి. ఇవే ట్రెండ్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి వరకు ఇదే ఫలితాలు కొనసాగితే వైసీపీ 90 శాతం విజయాలు సాధించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అసలు ప్రధాన ప్రతిపక్షం బోణీ కొట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖతాలో చేరింది. ఇంకా ఎక్కడా గెలుపొందలేదు.  కార్పొరేషన్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన అన్ని కార్పొరేషన్ ఫలితాల్లోనూ వైసీపీదే విజయం.. టీడీపీ ఖాతాలో ఒక్కటి కూడా లేదు.

    ముఖ్యంగా టీడీపీ అధినేత సహా, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నియోజకవర్గాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఫలితాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  చాలా చోట్ల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు.  ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధికార పార్టీ హవా కొనసాగింది. అయితే బాలయ్య  సొంత నియోజకవర్గం హిందూపురంలో అయినా టీడీపీ గట్టెక్కుతుందని అధిష్టానం చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న ఫలితాలు చూస్తే బాలయ్య దూకుడు పని చేయలేదనే చెప్పాలి.

    హిందూపురంలో ఓవరాల్ గా చూస్తే వైసీపీ జోరు కొనసాగుతున్నా.. ఒక చోట మాత్రం వైసీపీ, టీడీపీకి పోటీగా ఎంఐఎం పార్టీ దూసుకొచ్చింది. ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థి హిందూపురం మున్సిపాలిటీలో ఒక చోట అనూహ్యంగా గెలుపొందారు. అసలు పోటీలోనే ఉండదు అనుకున్న ఎం.ఐ.ఎం ఒక వార్డు నెగ్గింది.  ఏపీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇది అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా షాకే అని చెప్పాలి. అయితే ఓవరాల్  ఫలితాలు చూస్తే మొత్తం 38 వార్డులు ఉండగా.. వైసీపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎం సహా ప్రధాన పార్టీలో పోటీ చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు 38 వార్డుల్లో వైసీపీ 10 వార్డుల్లో గెలుపొందగా.. టీడీపీ 5 చోట్ల విజయం సాధించినట్టు తెలుస్తోంది. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

    ప్రస్తుతం అందుతున్న ఫలితాలు చూసినా.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండింగ్ చూసినా.. ఇక్కడ ఎమ్మెల్యే బాలయ్యకు షాక్ తప్పదనే చెప్పాలి. ఇక్కడి విజయాన్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విరామం లేకుండా ప్రతి అభ్యర్థి తరుపున స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. ఏకగ్రీవాలను అడ్డుకోగలిగారు. అలాగే ప్రతిపక్ష పార్టీకి సవాళ్లు విసిరారు. టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ మీసం కూడా మెలేశారు.  ఇంతలా శ్రమించినా.. అవేవి పని చేయలేదనే చెప్పుకోవాలి తాజా ఫలితాలు చూస్తుంటే. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: