Shock to tdp: టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. అధిష్టానం తీరుపై ఆవేదన

ఏపీలో టీడీపీకి మరో షాక్

టీడీపీకి వరుస షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల తెలంగాణ టీడీపీ అధ్యక్షడి హోదాలో ఉన్న ఎల్ రమణ రాజీనామా చేసి. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఇవాళ ఏపీలో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు..?

 • Share this:
  వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీడీపికి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత.. ప్రజల్లో మంచి పట్టు ఉండి.. టీడీపీలో కీలక పదవులు అనుభవించిన ఆమె ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతిచ్చారు. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఓ వైపు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే.. ఇదే సమయంలో పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది..

  విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. గతంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతి పనిచేశారు. ఇవాళ ఉదయం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే హైమావతి కూతురు స్వాతి వైసీపీలో కొనసాగుతున్నారు. తన కూతురు పార్టీ మారితే.. తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని హైమావతి చెప్పుకొచ్చారు. అయినా అధిష్టానం ఆమెను పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో ఆమె తీరు కారణంగానే పార్టీ అక్కడ ఓడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమెను అధిష్టానం చూసి చూడనట్టు వదిలేసింది. దీంతో ఆమె రాజీనామాకు సిద్ధమయ్యారు..  టీడీపీలో సీనియర్ నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పని చేసిన శోభా హైమావతి 1999లో ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎస్టీ అభ్యర్థిగా తొలి ప్రయత్నంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభ రవిబాబు చేతిలో ఓటమి చెందారు. అదే ఏడాది హైమావతి ఎస్టీ కాదంటూ కోర్టు తీర్పు వచ్చింది. 2009లో సామాజిక సమీకరణల్లో ఎస్. కోట అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హైమావతి అప్పటినుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు హైమావతి. 2014లో హైమావతి కుమార్తె శోభా స్వాతిరాణికి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల తరువాత ఆమె కూతురు స్వాతిరాణి వైసీపీలో చేరారు. ఆమె భర్త గుల్లిపల్లి గణేష్  ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నారు. హైమావతి తన కుమార్తె భవిష్యత్ కోసం పార్టీని వీడినట్టు తెలుస్తోంది.

  తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన హైమావతి.. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేసిన సంగతి తెలిసిందే. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా శోభ పనిచేశారు. అయితే, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు హైమావతి వివరణ ఇచ్చారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శోభ.. త్వరలోనే వైసీపీలో చేరే కనిపిస్తున్నాయి. ఇప్పటికే శోభా హైమావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: