హోమ్ /వార్తలు /politics /

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పనున్న మరో కీలక నేత.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్..!

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పనున్న మరో కీలక నేత.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్..!

తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి షాక్ తగలబోతోందా? మరో కీలక నేత పార్టీని వీడబోతున్నారా? చాలాకాలంగా పార్టీ కార్యకలాపాల్లో అంతంతమాత్రంగానే కనిపిస్తున్న ఆ నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

    తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి షాక్ తగలబోతోందా? మరో కీలక నేత పార్టీని వీడబోతున్నారా? చాలాకాలంగా పార్టీ కార్యకలాపాల్లో అంతంతమాత్రంగానే కనిపిస్తున్న ఆ నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చాలా కాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారట. తన అనుచరులకు ఇప్పటికే తన నిర్ణయాన్ని సూచాయగా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడుతున్నట్టు తెలిసి, ఇప్పటికే రేవంత్, ఉత్తమ్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు బుజ్జగించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అయినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని చెప్పారట.

    పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి, చేవేళ్ల లోక్ సభ నియోజకవర్గం స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ మరోసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటూ, ఆ పార్టీ బలోపేతం కోసం విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి వచ్చిన తనను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, అయినప్పటికీ తాను వెరవకుండా పోరాడుతున్నానని గతంలోనే ఎన్నోసార్లు చెప్పారు.

    Big shock to Telangana Congress Ex MP Konda Vishweshwar Reddy will may Join into BJP soon తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గుడ్ బై చెప్పనున్న మరో కీలక నేత.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్..!
    కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    అయితే ఇటీవల కాంగ్రెస్ లో పెరిగిన గ్రూపు రాజకీయాల వల్ల ఆ పార్టీ భవిష్యత్ పై కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నమ్మకం పోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం కలగకుండా ఉండేందుకే తాను ఇంతకాలం ఓపిక పట్టానని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని అనుచరులకు ఆయన చెప్పినట్టు సమాచారం. నేడో రేపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, కొద్ది కాలం నుంచే కాంగ్రెస్ అసంతృప్త నేతలను రప్పించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి నేతను బీజేపీలోకి రప్పించేలా తెలంగాణ బీజేపీ అధినాయకత్వం ఒప్పించడంలో సక్సెస్ అయింది.

    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

    First published:

    ఉత్తమ కథలు