టీడీపీకి భారీ షాక్... త్వరలో గుడ్‌బై కొట్టనున్న దేవినేని

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్‌కు ఓ మంచి ఆఫర్ వచ్చిందని అందుకే ఆయన సైకిల్ దిగిపోయేందుకు సిద్ధపడ్డారని సమాచారం.

news18-telugu
Updated: August 3, 2019, 8:45 PM IST
టీడీపీకి భారీ షాక్... త్వరలో గుడ్‌బై కొట్టనున్న దేవినేని
చంద్రబాబునాయుడితో దేవినేని అవినాష్ (Image:Devineni Avinash/Twitter)
news18-telugu
Updated: August 3, 2019, 8:45 PM IST
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే వరుసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా దేవినేని కుటుంబం నుంచి టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన సైకిల్ దిగిపోవాలని డిసైడ్ అయ్యారట. దేవినేని అవినాష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. దేవినేని అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలసి పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల్లో దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీని వీడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత నెహ్రూ చనిపోయారు. నారా లోకేష్‌కు అత్యంత దగ్గరగా ఉండే యువనాయకుల్లో దేవినేని కూడా ఒకరు. అలాంటి వ్యక్తి టీడీపీని వీడాలనుకోవడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్‌కు ఓ మంచి ఆఫర్ వచ్చిందని అందుకే ఆయన సైకిల్ దిగిపోయేందుకు సిద్ధపడ్డారని సమాచారం. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా దేవినేనికి అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారట.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...