BIG SHOCK TO TDP EXCEPT CHINARAJAPPA ALL MINISTERS LOST IN ASSEMBLY ELECTIONS SB
ఇద్దరంటే ఇద్దరే... ఆంధ్రా మినిస్టర్లకు బిగ్ షాక్
ఇదే అంశంపై చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. అమరావతి విషయంలో రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన పోరాటం కంటే ఎక్కువ ఉద్యమం చేయాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది.
మూడు నుంచి నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వెనుకబడ్డారు. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు వెనుకబడ్డారు.
ఏపీలో ఫలితాలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం మిగతా మంత్రులను సైతం ఇంటికి సాగనంపారు ఓటర్లు. కుప్పంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, అచ్చెంనాయుడు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా మంత్రులంతా ఘోర పరాజయం చవిచూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది. ఏపీలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులంతా షాక్ అయ్యేలా ఏపీలో ఫలితాల సరళి కనిపించింది. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పలువురు ప్రముఖులంతా పోటీలో వెనుకబడిపోయారు.
టీడీపీ తరఫున పోటీ చేసిన మంత్రులతో ఓటమి పాలయ్యారు. మూడు నుంచి నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వెనుకబడ్డారు. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు వెనుకబడ్డారు. మంగళగిరిలో నారా లోకేష్ కూడా ఓడిపోయారు. ఈ ఫలితాలతో నైరాశ్యంలో పడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పటివరకూ మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించలేదు.
ఓటమి బాటలోని మంత్రులు :
01. కళా వెంకట్రావు
02. సుజయ కృష్ణ రంగారావు
03. అయ్యన్నపాత్రుడు
04. ఘంటా శ్రీనివాసరావు
05.పితాని
06. దేవినేని ఉమ.
07. కొల్లు రవీంద్ర.
08. పత్తిపాటి పుల్లారావు
09. నక్కా ఆనందబాబు
10. నారా లోకేష్
11. శిద్దా రాఘవరావు(ఎంపీ)
12. సోమిరెడ్డి
13. నారాయణ
14. అమర్నాధ్ రెడ్డి
15. కాల్వ శ్రీనివాసులు
16. అఖిల ప్రియ
17. ఆది నారాయణ రెడ్డి(ఎంపీ)
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.