BIG SHOCK TO TDP BEFORE MUNICIPAL ELECTIONS GANTA SRINIVASA RAO MAIN FOLLOWER JOINED IN YCP NGS
Andhra Pradesh: టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలో చేరిన ప్రధాన అనుచరుడు: గంటాకు గ్రీన్ సిగ్నల్
వైసీపీలో చేరిన గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ముందు టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే త్వరలోనే గంటా కూడా చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది..? విజయసాయి రెడ్డి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు ముందు టీడీపికి షాక్ తగిలింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు? ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతకాలం గంటాకు కాశీ విశ్వనాథ్ కుడిబుజంలా ఉండేవారు. గంటాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునే వాడు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ అతడు పార్టీ మారడం టీడీపీకి షాకే అని చెప్పాలి. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బతప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాశీ విశ్వనాథం చేరికతో ఇప్పుడు గంటా ఎప్పుడు వైసీపీలో చేరుతారనే చర్చ మొదలైంది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు వస్తాను అంటే మేము కాదంటామా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు గంటా వైసీపీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పెట్టారని.. వాటిపై అధినేత జగన్ క్లారిటీ ఇచ్చాక గంటా చేరే అవకాశం ఉందన్ని విజయసాయి రెడ్డి చెప్పారు. దీంతో గంటా శ్రీనివాసరావును మున్సిపల్ ఎన్నికల్లోపూ వైసీపీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
తాజా పరిణమాలపై గంటా శ్రీనివాసరావు కూడా అధిష్టానంపై గుర్రుగానే ఉన్నారు. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ వచ్చి.. మున్సిపల్ ఎన్నికల్లో ఏఏ నియోజకవర్గాల్లో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి అన్నదానిపై చర్చించారు. అయితే జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిజయోజకవర్గం బాధ్యతలు స్వయానా అచ్చెన్నాయుడు, నిమ్మలరామునాయుడు చూడనున్నారు. అయితే ఉత్తర నియోజకవర్గంలో మాత్రం గంటా శ్రీనివాసరావుతో పాటు, పల్లా శ్రీనివాసరావు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. దీనిపై గంటా గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాను ఉంటుండుగా మరో ఇన్ ఛార్జ్ ఎందుకు అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది..
అయితే గంటా శ్రీనివాసరావు ఏ క్షణమైనా పార్టీ అవకాశం ఉందని టీడీపీ కూడా అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే ముందు జాగ్రత్తగా మరో ఇన్ ఛార్జ్ ను నియమించినట్టు సమాచారం. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల ముందు గంటా ప్రధాన అనుచురుడు పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి.. అయితే కాశీవిశ్వనాథ్ పార్టీలో చేరినప్పుడు అక్కడ అవంతి లేకపోవడం చర్చనీయాంశగా మారింది. ఆయనను చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదంటున్నారు.. మరి త్వరలో గంటా కూడా వైసీపీలో చేరితే అవంతి పరిస్థిఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం విశాఖలో ఈ పరిణామాలతో రాజీకీయం వేడెక్కింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే నగరంలో బలమైన నేత అయిన గంటాను.. వైసీపీిలోకి చేర్చుకోడానికి ఇదే సరైన సమయం అని వైసీపీ భావించినట్టు తెలుస్తోంది.