గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘోర అవమానం..

Chandrababu Naidu | గన్నవరం నుంచి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబునాయుడును విమానాశ్రయ సిబ్బంది చెక్ చేసి పంపించారు.

news18-telugu
Updated: June 14, 2019, 11:02 PM IST
గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘోర అవమానం..
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది
  • Share this:
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘోర అవమానం జరిగింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆయన్ను విమానాశ్రయ సిబ్బంది చెక్ చేసి పంపించారు. చంద్రబాబునాయుడుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా సరే ఆయన వాహనాన్ని కూడా విమానాశ్రయం లోనికి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు చంద్రబాబునాయుడు కూడా ప్రయాణికుల బస్సులోనే వెళ్లారు. వీఐపీ, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబునాయుడుకు కనీసం వాహనం కూడా కేటాయించకపోవడం వివాదాస్పదంగా మారింది. భద్రతా సిబ్బంది కూడా సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబునాయుడుని కూడా తనిఖీ చేసి పంపించారు. ఇటీవల చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించారు. ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌-1, ఎస్కార్ట్‌-2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ-1, ఎన్‌ఎస్‌జీ-2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్​లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు. దీనిపై వివాదం చెలరేగింది. ఇప్పుడు చంద్రబాబును తనిఖీ చేసి పంపించడం వివాదాస్పదమైంది.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading