Home /News /politics /

BIG SHOCK TO NARA CHANDRA BABU NAIDU IN KUPPAM MUNICIPAL ELECTION RESULT WHAT IS THE MAIN REASON NGS

Chandrababu Graff down: కుప్పంలో చంద్రబాబుకు ఇక కష్టమే.. ప్రతి ఏడాది తగ్గుతున్నగ్రాఫ్.. కారణం అదేనా?

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు

Chandrababu Graff down: ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికను సైతం వైసీపీ వన్ సైడ్ చేసేసింది. చంద్రబాబు సామ్రాజ్యంలో వైసీపీ జెండా పాతింది. దీంతో తొలిసారి టీడీపీ కంచుకోట పూర్తిగా బద్దలైంది. ఇది ఇప్పటికిప్పుడు అయిన డ్యామేజ్ కాదు.. ఏ ఏడాదికి ఆ ఏడాది చంద్రబాబు ఇమేజ్ అక్కడ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయ్యింది. అందుకు కారణం అదేనా..?

ఇంకా చదవండి ...
  Chandrababu Graff down in kuppam: కుప్పం మున్సిపాలిటీ ఫలితం ఎలాంటి మెసేజ్ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తన సామ్రాజ్యంగా చెప్పుకునే నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. అయినా ప్రతిపక్ష నేత అడ్డగా చెప్పుకునే నియోజకవర్గం అది.. 40 ఏళ్లుగా దాన్నిఆయన కంచుకోటగా మార్చుకున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలే జరపకుండా ఏకగ్రీవంగా ఇంతకాలం నెట్టుకొచ్చారు. అలాంటి చోటు టీడీపీ (tdp)కి ఘోరర ఓటమి తప్పలేదు. పోటా పోటీగా ఫలితం ఉండి ఓడితే.. అధికార పార్టీ ప్రలోభాలు.. అని అంతా సరిపెట్టుకో వచ్చు.. కానీ ఆ మున్సిపాలిటీలో వార్ వన్ సైడ్ అయ్యింది. కుప్పం లాంటి నియోజకవర్గంలో వైసీపీ (ycp) హవా స్పష్టంగా కనిపించింది. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితం అయ్యింది. దీంతో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి అధికార వైసీపీ.. కుప్పం (kuppam) మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. గత అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల వరకు ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పడంలేదు. ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి చూశారు. మిగిలిన మున్సిపల్ ఫలితాలు కూడా చంద్రాబాబుకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఘోర ఓటమి టీడీపీ అధిష్టానం కానీ.. కేడర్ కానీ జీర్ణించుకోలేనిదే అని చెప్పాలి...

  గతంలో జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కుప్పం పరిధిలో టీడీపీకి వైసీపీ భారీ షాకే ఇచ్చింది. అయితే అప్పుడు చంద్రబాబు పెద్దగా అలర్ట్ అవ్వలేదు. కానీ ఈ సారి ఎలాగైనా వైసీపీ స్పీడ్ ను అడ్డుకోవాలని స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. నేరుగా కుప్పానికి వెళ్లి.. అందరినీ దగ్గరుండి కలిశారు. ఈ మున్సిపల్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ సారి వైసీపీ పప్పులు ఉడకవు అంటూ కామెంట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సైతం తనయుడు లోకేష్ ను ప్రచార రంగంలోకి దింపారు. మాజీ మంత్రులను అక్కడే ఉంచారు. కేడార్ కు ఎప్పటికప్పుడు ఫోన్ ల ద్వారా దిశా నిర్దేశం చేశారు. తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి గెలుపు కోసం వ్యూహాలు రచించారు. ఇంత చేసినా.. కనీసం గౌరవ ప్రథమైన పోటీ ఇవ్వలేకపోయింది టీడీపీ.

  ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్‌ బిశ్వబూషన్‌ హరిచందన్ కు పాజిటివ్

  అయితే ఈ ఓటమి ఇప్పటికిప్పుడు అనూహ్యంగా జరిగింది కాదు.. దీనికి మెట్లు ఎప్పుడో పడ్డాయి. 2019 ఎన్నికల ముందు నుంచే కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వస్తోంది వైసీపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 2014తో పోలిస్తే దాదాపు 14 వేలు తగ్గించేలా చేసింది వైసీపీ. గత ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు మెజార్టీని పరిశీలిస్తే అసలు గ్రాఫ్ ఎలా తగ్గుతుందో అర్థమవుతోంది. టీడీపీకి కంచు కోటా అయిన కుప్పంలో వైసీపీ గెలవడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  ఇదీ చదవండి: : చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి వదిలేయాలి.. కుప్పంలో కష్టం.. పుంగనూరు రండి

  అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గిన చంద్రబాబు మెజార్టీ
  2004 – 59,588
  2009 – 46,066
  2014 – 47,121
  2019 – 30,722
  ఇలా ప్రతి ఎన్నికలకు చంద్రాబు గ్రాఫ్ తగ్గుతూనే వస్తోంది. ఇలా తగ్గడానికి వైసీపీ వ్యూహాలకు తోడు.. చంద్రబాబు సెల్ఫ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ముఖ్యంగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గాన్ని.. అక్కడి నేతలను గాలికి వదిలేశారనే టాక్ ఉంది. కేవలం ఎన్నికలప్పుడు తప్ప.. తమను అధినేత పట్టించుకోరని అక్కడి కేడర్ ఫీలవుతున్నట్టు సమాచారం. దానికి తోడు స్థానిక నేతల మధ్య విబేధాలు ఉన్నా.. వాటిపై చంద్రబాబు ఫోకస్ చేయలేదు.. తాను లేకపోయినా ప్రజలు గెలిపించేస్తారనే అతి నమ్మకం కూడా చంద్రబాబు కొంప ముంచింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Kuppam, Tdp, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు