జగన్ ఫ్యాన్ ముందు తేలిపోయిన మెగా ‘ఫ్యాన్స్’

నాగబాబు, పవన్ కళ్యాణ్ (naga babu pawan kalyan)

మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నీహారిక అంతా ప్రచారం చేశారు. అందరూ పవన్ కళ్యాణ్‌కు బాసటగా నిలిచారు. కానీ, జగన్ ఫ్యాన్ గాలికి జనసేన తట్టుకోలేకపోయింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ప్రభావం చూపిస్తారని, ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారంటూ మెగా అభిమానులు ఆశించారు. ఎన్నికల తర్వాత కింగ్ మేకర్ కాకపోయినా.. కనీసం 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం కంటే మెరుగైన ప్రదర్శన చూపుతారేమోనని భావించారు. అంతకంటే కొంచెం తక్కువగా సీట్లు వచ్చినా ఫరవాలేదని అనుకున్నారు. కానీ, వారు ఎలాంటి అంచనాలు పెట్టుకున్నా.. అవన్నీ విఫలం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పరాజయం చెందారు. రెండుచోట్లా ఆయన వైసీపీ చేతిలోనే ఓడిపోయారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌ను ఓడించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు, నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.

    ఏపీ ఎన్నికల్లో జనసేనను గెలిపించడం కోసం మెగా కుటుంబసభ్యులు చాలా శ్రమించారు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నీహారిక అంతా ప్రచారం చేశారు. అందరూ పవన్ కళ్యాణ్‌కు బాసటగా నిలిచారు. ప్రచారం కూడా చేశారు. కానీ, జగన్ ఫ్యాన్ గాలికి జనసేన తట్టుకోలేకపోయింది. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొందారు.
    First published: