హోమ్ /వార్తలు /National రాజకీయం /

Andhra Pradesh: సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి షాక్.. చంద్రబాబును కలిసిన వైసీపీ నేత

Andhra Pradesh: సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి షాక్.. చంద్రబాబును కలిసిన వైసీపీ నేత

సొంత జిల్లాలో సీఎం జగన్ కు షాక్

సొంత జిల్లాలో సీఎం జగన్ కు షాక్

ఏపీలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన కీలక వైసీపీ నేత చంద్రబాబును కలిశారు. దీంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..? ఇంతకీ ఎవరా నేత.. చంద్రబాబును ఎందుకు కలిశారు?

ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం సొంత జిల్లా కడపకు చెందిన కీలక నేత.. అది కూడా సీఎం జగన్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు అయిన నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ వైసిపి నేత, పిసిసి మాజీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. వీరిద్దరి మధ్య రాయచోటి నియోజవర్గంలో పార్టీ  పరిస్థితి, టీడీపీ నేతలు కార్యకర్తల స్థితిగతుల పై చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కాగా రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆర్ఆర్ సోదరులతో సమన్వయం చేసుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపైన త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని అధినేత రాంప్రసాద్ రెడ్డి కి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

గతంలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో శ్రీకాళహస్తిలో చంద్రాబాబు పర్యటనకు వెళ్లిన సమయంలోనే రాంప్రసాద్ రెడ్డి కలిశారు. అప్పటికే పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడంతో ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధపడినట్టు ఉన్నారు. ప్రస్తుత రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అభిమానులు చెప్పుకుంటు ఉంటారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని మండిపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ, అసంతృప్తికి లోనై టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. టీడీపీ చేరాలని మండిపల్లి తీసుకున్న నిర్ణయంపై స్థానిక వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి: సీఎం సొంత జిల్లాలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది

మొదట 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. తరువాత వైసీపీలో చేరారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ తరఫున రాయచోటి ఎమ్మెల్యే స్థానం ఆశించి భంగపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా మూడో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని 2018 జూన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీలో కలకలం రేపాయి. తాను 2019 ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉంటానని మండిపల్లి తేల్చి చెప్పారు. అయితే అప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకున్న ఆయన.. అధినేత మాటతో వెనక్కు తగ్గారు. 2019 ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు.

ఇదీ చదవండి: సీఎం సొంత జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నిప్పురాజేసిన టిప్పు సుల్తాన్ విగ్రహం

అయినా పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదనలో ఉన్నారు. ముఖ్యంగా తన గెలుపు కోసం ఎంతో కష్ట పడ్డా గడికోట శ్రీకాంత్ రెడ్డి మాత్రం తనను అస్సలు పట్టించుకోవడం లేదని.. పైగా తన వర్గంపై పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారి కొంతకాలగా రాంప్రసాద్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. విషయాన్ని సీఎం జగన్ కు చేర వేసే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వడం లేదని తన వర్గం నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా వైసీపీలో ఉండడం మంచిది కాదని నిర్ణయించుకున్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఎప్పుడు చేరాలి అన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Kadapa, TDP, Ycp

ఉత్తమ కథలు