• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • BIG SHOCK TO AP GOVERNMENT HIGH COURT UPHOLDS SANGAM DAIRY ACQUISITION NGS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్.. సంగం డెయిరీ కేసులో సరికొత్త ట్విస్ట్

sangam Dairy

సంగం డెయిరీ విషయంలో దూకుడు పెంచిన ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే దూళిపాళ్ల నరేంద్ర విచారణపై స్టే విధించిన కోర్టు.. తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది.

  • Share this:
    సంగం డెయిరీ విషయంలో దూకుడుగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి షాకులు తప్పడం లేదు. ఆ సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు హైకోర్టు తీర్పు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పడంతో  ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకులు పడినట్టే.

    కొద్ది రోజుల క్రితం.. సంగం డెయిరీలో అక్రమాలంటూ… ధూళిపాళ్లను తెల్లవారుజామునే అరెస్ట్ చేసి..రెండు రోజులకే… సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మార్చేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

    అలాగే రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది. డెయిరీ రోజువారీ వ్యవహారాలను ఆయనే చూస్తున్నారు. సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని .. సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.

    ఇప్పుడు అదే అంశాలపై మళ్లీ కేసులు పెట్టి రాత్రికి రాత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడమే కాకుండా.. ఇంకా అక్రమాలు జరిగాయో లేదో నిర్ధారణ కాకుండానే.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ధూళిపాళ్ల స్థానంలో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్న డైరక్టర్లు.. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్థను కూడా పట్టించుకోకుండా.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల హద్దులను దాటేసిందని కోర్టుకు తెలిపారు.

    దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కొత్త జీవో చెల్లదంటే స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ జీవో చెల్లదని హైకోర్టు స్పష్టంచేయడంతో మళ్లీ కార్యకలాపాలు.. డైరక్టర్ల చేతికి వస్తాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయాలపై మినహా.. మరేఇతర అంశాలపై సోదాలు చేయవద్దని… కంపెనీ మార్కెటింగ్.. పాల ఉత్పత్తి.. సేకరణ వంటి అంశాలపై అసలు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా.. చేయగలిగినంత నష్టం చేశామన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందిన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: